Hyderabad: మియాపూర్-పటాన్చెరువు రూట్‌లో డబుల్ డెక్కర్ బస్సులు
మెట్రో రెండోదశ విస్తరణ పనుల్లో వేగం పుంజుకుంటున్నది. సెకండ్ ఫేజ్‌లో ప్రతిపాదించిన ఆరు కారిడార్లకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిస్ర్టా కన్సల్టెన్సీతో తయారు చేయించిన అధికారులు, తాజాగా జాతీయ రహదారులపై నుంచి చేపట్టనున్న మెట్రోపనులపై దృష్టి సారించారు.
హైదరాబాద్ సిటీ: మెట్రో రెండోదశ విస్తరణ పనుల్లో వేగం పుంజుకుంటున్నది. సెకండ్ ఫేజ్‌లో ప్రతిపాదించిన ఆరు కారిడార్లకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిస్ర్టా కన్సల్టెన్సీతో తయారు చేయించిన అధికారులు, తాజాగా జాతీయ రహదారులపై నుంచి చేపట్టనున్న మెట్రోపనులపై దృష్టి సారించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్), నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 22న మెట్రో రెండోదశ విస్తరణకు సంబంధించిన రూట్‌మ్యా్‌పను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా పనుల డీపీఆర్‌ను హెచ్‌ఏఎంఎల్ అధికారులు దాదాపుగా పూర్తి చేశారు. పలు ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి వచ్చే అడ్డంకులు, కావాల్సిన భూసేకరణపై లోతుగా పరిశీలిస్తున్నారు. రూ.20 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా ఆర్టీసీ, రైల్వేస్టేషన్లు కేంద్రీకృతమైన ప్రాంతాలకు మెట్రోను అనుసంధానం చేయడంపై విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి తూర్పున ఉన్న నాగోలుతో పాటు దక్షిణాన ఉన్న రాజేంద్రనగర్, ఆరాంఘర్‌లను కలుపుతూ ప్రతిపాదించిన 29 కిలోమీటర్ల మార్గంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్ ఉంది.
అలాగే ఎల్‌బీనగర్ - హయత్‌నగర్(LB Nagar - Hayat Nagar) మార్గాన్ని నేషనల్ హైవేపై నిర్మించాల్సి ఉంది. ఇలాంటి చోట్ల భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని డీపీఆర్‌ను తయారు చేస్తున్నారు.
మియాపూర్ - పటాన్‌చెరు, ఎల్‌బీనగర్ - హయత్‌నగర్ రూట్‌లో రెండు రోజులపాటు పరిశీలించిన అంశాలపై రసూల్‌పురాలోని మెట్రోరైలు భవన్‌లో నేషనల్ హైవే అధికారులతో హెచ్‌ఏఎంఎల్ ఎండీ బుధవారం చర్చించారు.
సమావేశంలో ఆర్‌అండ్‌బీ(ఎన్‌హెచ్) ఈఎన్‌సీ గణపతిరెడ్డి, జాతీయరహదారుల ఎస్‌ఈ పి.ధర్మారెడ్డి, హెచ్‌ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనందమోహన్, ఎస్‌ఈ వై.సాయపరెడ్డి, జనరల్ మేనేజర్లు ఎన్.రాజేశ్వర్, విష్ణువర్థన్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు
Jul 12 2024, 19:32