విద్యాశాఖ మంత్రిని నియమించాలి: దళితరత్న బుర్రి వెంకన్న
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే సూర్యపేట, బాలేంల సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ హాస్టల్లో ప్రిన్సిపాల్ బీర్లు తాగుతుందని డిగ్రీ విద్యార్థినిలను ప్రిన్సిపాల్ వేధిస్తుందని ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారని, అలాగే నల్గొండ జిల్లాలోని "డిండి" మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకులాల పాఠశాలలో విద్యార్థులకు ఎలుకలు కరవడం కలకలం రేపుతుందని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న బుర్రి వెంకన్న అన్నారు. దేవరకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల గదులు శుభ్రంగా లేకపోవడం, పురుగుల అన్నం పెట్టడం, వండిన కూరలు సరిగా లేకపోవడం, కొన్ని విద్యార్థి సంఘాలు అడగగా లోపలికి అనుమతుల్లేవని ప్రిన్సిపల్ పొంతన లేని సమాధానం చెపుతూ వారి ఆవకతౌకలు, వారి తప్పిదాలు బయటపడతాయని, ప్రజాసంఘాలను లోపలికి అనుమతించకపోవడం చాలా బాధాకరం ఆవేదన వ్యక్తం చేశారు. డిండి ఎస్సీ బాలికల హాస్టల్స్ ను తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని వారికి నాణ్యమైన భోజనం అందించాలని, అలాగే బాలికల హాస్టల్లో పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ ను తక్షణమే విచారణ చేసి సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గవర్నమెంట్ గురుకుల హాస్టల్స్ లో బాలికలను చేర్పించాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. అసలు హాస్టల్లో పిల్లలను ఉంచాలా, ఇంటికి తీసుకెళ్లాలా సందిగ్ధంలో తల్లిదండ్రులు ఉన్నారని తెలిపారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని అయోమయంలో తల్లిదండ్రులు ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తప్పులకు పాల్పడుతున్న ఇలాంటి హాస్టల్ ప్రిన్సిపాల్ ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని మరియు ప్రముఖ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని గురుకులాల కార్యదర్శిగా నియమించి సంక్షేమ హాస్టల్స్ ను తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణ గురుకుల హాస్టల్లలో నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య అందించాలి.
విద్యార్థుల పట్ల శ్రద్ధతో పాటు బాధ్యతాయుతంగా సంక్షేమ హాస్టల్లో అధికారులు, ప్రభుత్వ పాఠశాల కళాశాల అధికారులు సక్రమమైన విధి నిర్వహణను నిర్వర్తించాలని, రాష్ట్రంలో ఇలాంటి ఉదాంతాలు తలెత్తితే ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ పక్షాన మరో న్యాయబద్ధమైన ఉద్యమానికి దళిత బహుజన సంఘాలను ఐక్యం చేసి శ్రీకారం చుడతామని పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేశారు.
Jul 09 2024, 19:59