శరవేగంగా దిగువ కాఫర్ డ్యాం స్లూయిజ్ పనులు
పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యాం స్లూయిజ్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి
పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యాం స్లూయిజ్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్టును పరిశీలించి దిగువ కాఫర్ డ్యాం వద్ద సీపేజీ జలాలు బయటకు పంపేందుకు నిర్మిస్తున్న స్లూయిజ్ పనులను వేగవంతం చేయాలని, వరద ఉధృతి పెరగక మునుపే పూర్తిచేసి గోదావరి జలాలు కాఫర్ డ్యాంల మధ్యకు చేరుకోనివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. దీంతో స్లూయిజ్ నిర్మాణం పనులు వేగవంతం చేసినట్లు ఈఈ పాండురంగయ్య శనివారం తెలిపారు.
కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అప్రూవల్స్ మేరకు పనులు ప్రారంభించామని.. రానున్న రెండ్రోజుల్లో స్లూయిజ్ గేట్ల అమరిక పనులు పూర్తవుతాయని, గోదావరి జలాలు కాఫర్ డ్యాంల మధ్యకు వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. సీపేజీ జలాలను బయటకు పంపడానికి ఏడాది క్రితం ప్రారంభించిన స్లూయిజ్ పనులు నత్తనడకన నడిచాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన తర్వాత పనులు ఊపందుకుని అప్పుడే గేట్లు బిగించే వరకూ వచ్చింది.
రెండ్రోజుల్లో ఇది పూర్తయితే స్పిల్‌వే బ్యాక్ వాటర్.. కాఫర్ డ్యాంలోకి రాకుండా నివారించవచ్చు, డీవాటరింగ్ ద్వారా కాఫర్ డ్యాం నడుమ సీపేజీ జలాలను తొలగించవచ్చని.. తద్వారా ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం, డయాఫ్రం వాల్ పనులకు ఎలాంటి ఆటకం ఉండదని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
Jul 07 2024, 10:19