Hyderabad: నైనీలో బొగ్గు తవ్వకాలకు లైన్‌క్లియర్..
ఒడిసాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనిలో తవ్వకాలకు మార్గం సుగమమైంది. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్పందించిన ఒడిసా సర్కారు ఇటీవల అటవీ అనుమతులు మంజూరు చేసింది.
ఒడిసాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనిలో తవ్వకాలకు మార్గం సుగమమైంది. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్పందించిన ఒడిసా సర్కారు ఇటీవల అటవీ అనుమతులు మంజూరు చేసింది. దీంతో త్వరలో అటవీ భూముల బదిలీ జరగనుంది.
నిజానికి, నైనీ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు 2022 అక్టోబరులోనే అటవీ అనుమతులు ఇచ్చాయి. కానీ, వన్యప్రాణుల నిర్వహణ ప్రణాళిక(వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ ప్లాన్)ను వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సిద్ధం చేయకపోవడంతో ఒడిసా ప్రభుత్వం ఇన్నాళ్లూ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో అంగీకారం తెలపలేదు. దీంతో భూముల బదిలీ జరగలేదు
ఈ అంశమై బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఒడిసా అధికారులతో పలుమార్లు స్వయంగా సమావేశమయ్యారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా కేంద్ర బొగ్గు, గనుల శాఖకు విజ్ఞప్తి చేశారు.
దీంతో ఒడిసా సీఎంతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమస్య పరిష్కారమయ్యేలా చేశారు. ఆటంకాలు తొలగిపోయిన నేపథ్యంలో నైనీ కోల్ బ్లాక్‌కు సంబంధించిన అటవీ భూముల బదిలీ, ఇతర అనుమతుల విషయంలో ఒడిసా ప్రభుత్వాధికారులను సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు కలిశారు. వీలైనంత త్వరగా అటవీ భూమి బదలాయింపు చేయాలని కోరారు.
Jul 07 2024, 09:16