Engineering Colleges: 4వేలకు పైగా సీఎస్‌ఈ సీట్లు..
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎ్‌సఈ), సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎ్‌సఈ), సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కోర్ బ్రాంచ్‌లు అయిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటలర్జీ వంటి ఇంజనీరింగ్ కోర్సులను నిర్వహించే కాలేజీలకు మరింత ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా సీఎ్‌సఈ సీట్లను పెంచేందుకు సర్కారు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్‌సెట్ రెండోదశ కౌన్సెలింగ్ తర్వాత సీట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరంలో కోర్ బ్రాంచ్‌ల్లో సీట్లు తగ్గించుకొని ఆమేరకు సీట్లను సీఎ్‌సఈలో పెంచుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి కొన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. అలాగే, మరికొన్ని కళాశాలలు కోర్ బ్రాంచ్‌లను అలాగే కొనసాగిస్తూ అదనంగా సీఎ్‌సఈ కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేశాయి. ప్రైవేటు కాలేజీల అభ్యర్థనలకు ఏఐసీటీఈ అమోదం తెలిపినప్పటికీ, కోర్ బ్రాంచ్ ల్లో సీట్ల తగ్గింపునకు సర్కారు విముఖత చూపుతున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో కోర్ బ్రాంచ్‌ల సీట్ల తగ్గింపు కోరుకున్న కళాశాలల్లో సుమారు 1,700 సీట్లు తగ్గుతుండగా, కోర్ బ్రాంచ్‌లు నిర్వహిస్తున్న కాలేజీలకు సుమారు 4,500 సీఎ్‌సఈ సీట్లకు అనుమతి లభించవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఎప్‌సెట్ మొదటి దశ కౌన్సెలింగ్‌కు గతేడాది సీట్ల ప్రకారమే కాలేజీలకు అనుమతులు ఇస్తుండగా, రెండో దశ కౌన్సెలింగ్ నాటికి సీట్ల పెంపు ఉండే అవకాశం ఉందని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, ఈ నెల 8నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్స్ ఎక్సర్‌సైజ్ ప్రారంభం కానుండడంతో కళాశాలలకు అఫిలియేషన్/కోర్సులు/సీట్ల కేటాయింపు వివరాలను శనివారం సాయంత్రం జేఎన్‌టీయూ అధికారులు ఉన్నత విద్యామండలికి సమర్పించారు.
Jul 07 2024, 08:24