Congress: ఈనెల 10న తెలంగాణకు కురియన్ కమిటీ
Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.
పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కాంగ్రెస్ (Congress) వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ (AICC) నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. తెలంగాణలో (Telangana) నిజనిర్ధారణ కోసం కురియన్ కమిటీని అధిష్టానం నియమించింది.
కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈనెల 10న రాష్ట్రానికి రానున్న కమిటీ... తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి సమాచారాన్ని సేకరించనుంది. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. కురియన్ కమిటీ రిపోర్ట్ తర్వాతే కార్పొరేషన్ పదవులు ఇద్దామనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నట్లు సమాచారం.
Jul 06 2024, 12:40