Rythu Runa Mafi | రుణమాఫీకి నిధులెట్ల?.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు
రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను ఈ నెలాఖరులోగా ప్రవేశపెట్టాల్సి ఉండటంతో సంబంధిత అంచనాలను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తున్నది.
దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వ్యవసాయం, జౌళి, రెవెన్యూ తదితర శాఖలతో బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగుల జీతాలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త నిర్ణయాలను తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.
రూ.28 వేల కోట్లకు చేరిన అప్పు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి ఇప్పటివరకు రూ.28 వేల కోట్ల అప్పులు తెచ్చింది. ఈ నెలాఖరు నాటికి మొత్తం అప్పు రూ.31 వేల కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాల మాఫీ, రైతు భరోసా, 6 గ్యారంటీలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైనన్ని నిధులను బడ్జెట్‌లో కేటాయించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Jul 04 2024, 19:07