చంద్రబాబు, రేవంత్ బంధంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వాక్యాలు
Telangana: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
స్పందించారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురుశిష్యులు కాదని.. సహచరులని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రేవంత్ చాలా సార్లు చెప్పారన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్ తెలంగాణ సీఎం అని తేల్చిచెప్పారు. చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులు అనే వారివి అవగాహనలేని మాటలని కొట్టిపారేశారు. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే అని వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాల కోసం బీఆర్‌ఎస్ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్సుతో ఏడు మండలాలను ఏపీలో కలిపారని చెప్పుకొచ్చారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేబినెట్ విస్తరణపై పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుందన్నారు.
త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు. పదిహేనేండ్లు తామే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్ వి కల్లిబొల్లి కబుర్లే అంటూ విమర్శించారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని.. పుట్టింది బతకడానికి... చావడానికి కాదని అన్నారు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పిదాలు ఆయన్ని వెంటాడుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Jul 03 2024, 20:10