GHMC: గ్రేటర్ ఆస్తుల పరిరక్షణపై సర్కార్ ఫోకస్..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో(GHMC) చాలా ఏరియాల్లో కోట్ల విలువైన భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. ఇటీవలే మియాపూర్‌లో రాత్రికి రాత్రే టెంట్లు వేసి ఆక్రమించడానికి ప్రయత్నించారు.
అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఇదే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో(GHMC) చాలా ఏరియాల్లో కోట్ల విలువైన భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. ఇటీవలే మియాపూర్‌లో రాత్రికి రాత్రే టెంట్లు వేసి ఆక్రమించడానికి ప్రయత్నించారు.
అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఇదే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సీఎం రేవంత్ సర్కార్ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కమిషనర్ అసెట్స్ ప్రొటక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో ప్రత్యేకంగా విభాగాన్ని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఇప్పటి వరకు ఉన్న EVDM ను అసెట్స్ ప్రొటక్షన్ లో విలీనం చేయనున్నారు. GHMC, HMDA పరిధికి ఈవీడీఎంను విస్తరించనున్నారు. ఆస్తుల రక్షణ కోసం ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు, 8 మంది డీఎస్పీలు, సీఐలు, డిప్యూటీ కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ వాటర్ బోర్డు, ఫైర్ అధికారులను ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం మూడు వేల మంది సిబ్బందితో ప్రత్యేక టీం ఏర్పాటు చేయనున్నారు.
Jun 29 2024, 19:12