TS News: పనస పండ్ల మధ్య గంజాయి తరలింపు
గంజాయి అక్రమ రవాణాలో మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు నిందితులు. చివరకు పనస పండ్లను సైతం గంజాయి అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు.
అయినా సరే పోలీసులు మరింత తెలివిగా వ్యవహరించి వారిని పట్టుకుంటున్నారు. పనస పండ్ల మధ్యలో గంజాయిని పెట్టి తరలిస్తుండగా షామీర్ పేట్ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్: గంజాయి అక్రమ రవాణాలో మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు నిందితులు. చివరకు పనస పండ్లను సైతం గంజాయి అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు. అయినా సరే పోలీసులు మరింత తెలివిగా వ్యవహరించి వారిని పట్టుకుంటున్నారు. పనస పండ్ల మధ్యలో గంజాయిని పెట్టి తరలిస్తుండగా షామీర్ పేట్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులతో పాటు 33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఎవరికి అనుమానం రాకుండా పనస పండ్ల మధ్య గంజాయిని అమర్చి నిందితులు తరలిస్తున్నారు.
పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి శామీర్ పేట్ టోల్‌గేట్ వద్ద నిందుతులను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మేడ్చల్ నుంచి శామీర్ పేట వైపునకు వెళుతున్న వాహనాన్ని అడ్డగించి పట్టుకున్నారు.
ఏపీలోని విశాఖపట్నం నుంచి తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతం వైపునకు రాజీవ్ రహదారి మీదుగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు అవుట్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ వాహనంలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Jun 29 2024, 17:21