మాన్యం చెల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత భవనం త్వరగా పూర్తి చేయాలి. ఐద్వా డిమాండ్
మాన్యం చెల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత భవనం త్వరగా పూర్తి చేయాలి. ఐద్వా డిమాండ్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఈ రోజు మాన్యం చేల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సర్వే నిర్వహించడం జరిగింది. ఐద్వా అధ్యక్ష మరియు కార్యదర్శి మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలోని మాన్యం చెల్కా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత భవనం లేక ఇక్కడ సిబ్బంది ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వచ్చిన పేషెంట్లకు గాలి వెళుతురు లేక ఇబ్బంది పడుతున్నారు.వెంటనే సొంత భవనం నిర్మించాలని కోరుతూ ఇక్కడ స్టాఫ్ 15 మంది ఉన్నారు.
ఒకే డాక్టరు రోజు కి 100 మంది పేషెంట్లను చూడడం జరుగుతుంది. కావున ఇంకొక డాక్టర్ ని రిఫర్ చేయాలని కోరుతూ ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఒకే డాక్టర్ రోజు చూసే 100 మందికి కాక అదనంగా పేషెంట్లు వస్తారు. వాళ్లకు ఫార్మసిస్ వాళ్లే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది.
అలా కాకుండా డాక్టరు పరీక్షలు చేసి చూస్తే బాగుంటుందన్నారు. గవర్నమెంట్ నిధులు కేటాయించి సొంత హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఇక్కడ స్టాఫ్ కి శాలరీస్ కూడా మంత్లీ మంత్లీ రావటం లేదు వైఫై కనెక్షన్ వాళ్ళ సొంత ఖర్చులతోనే ఉపయోగిస్తున్నారు.
అలాగే కరెంట్ బిల్లు కూడా (20000) ఇరవై వెయ్లు పెండింగ్ లో ఉంది. ఈ సమస్యలపై త్వరగా ప్రభుత్వం స్పందించి ఇక్కడ కావలసిన నిధులు కేటాయించాలి అని డిమాండ్ చేసినారు.
Jun 28 2024, 19:19