బీ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ అధికారుల ప్రకటన..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి , ఆవర్తనం కారణంగా రాష్టంలో ఈరోజు నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈరోజు అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి , ఆవర్తనం కారణంగా రాష్టంలో ఈరోజు నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈరోజు అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ఇంటేన్సిటీ స్పెల్‌తో భాగ్యనగరం మొత్తం కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడితే, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Jun 28 2024, 15:10