/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ Raghu ram reddy
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ

తెలంగాణ(telangana) గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Radhakrishnan) సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)తో సమావేశం అయ్యారు.

తెలంగాణ(telangana) గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్(Radhakrishnan) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)తో సమావేశం అయ్యారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.

రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారని టిడిపి వర్గాలు చెబుతున్నారు. ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావించలేదని పేర్కొంది.

గత కొన్నేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (APRA)కి సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన పూర్తైన 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన అస్పష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

తొలి ప్రపంచ కమ్మ మహాసభ - చంద్రబాబు, రేవంత్ హాజరు..!!

ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ సభల ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావటం..

విశేష సేవలందించిన వారికి గుర్తింపు ఇవ్వటంతో పాటుగా ఇతర వర్గీయులకు చేయూతనిచ్చేలా కార్యక్రమాలు ఖరారు చేసారు

కమ్మ మహాసభ ద్వారా

కమ్మ సామాజిక వర్గీయుల ఐక్యత...అభివృద్ధి..భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేసారు.

ఈ సంస్థ జెట్టి కుసుమకుమార్ నాయకత్వంలో ఏర్పాటు అయింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా ప్రపంచ కమ్మ మహాసభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.

ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తరలి వస్తున్నారు. ప్రధానంగా ఈ మహాసభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు.

PV Narasimha Rao: తెలుగు ఠీవీ పీవీకి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి

బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ నరసింహ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్మరించారు. పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారని గుర్తుచేశారు.

బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ నరసింహ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్మరించారు. పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారని గుర్తుచేశారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అంజలి ఘటించారు. రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు

దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన గొప్ప మేధావి పీవీ నరసింహ రావు. భూ స్వామ్య కుటుంబంలో పీవీ జన్మించారు. తనకు గల 1200 ఎకరాల్లో 1000 ఎకరాలను పేదలకు పంచారు. పీవీ నరసింహ రావు అమలు చేసిన భూ సంస్కరణలతో రైతు కూలీలకు భూమి దక్కిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఏపీ సీఎం పదవి చేపట్టి భూ సంస్కరణలను అమలు చేశారు

ఏ పదవి చేపట్టిన వన్నె తీసుకొచ్చారు. పీవీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో గురుకుల విద్యను ప్రవేశపెట్టారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నవోదయ పాఠశాలలను ప్రారంభించారు.

జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఓపెన్ జైల్ అనే పద్ధతికి శ్రీకారం చుట్టారు. సీఎంగా భూ సంస్కరణలు, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు.

తొలి పర్యటన ప్రైవేటు దవాఖాన ప్రారంభానికా

సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటనలో ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవానికి రానుండటంపై బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి భగ్గుమన్నారు. సీఎంకు ఆరు నెలల తర్వాతైనా జిల్లాల్లో పర్యటించడానికి తీరిక దొరికిందని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటనలో ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవానికి రానుండటంపై బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి భగ్గుమన్నారు. సీఎంకు ఆరు నెలల తర్వాతైనా జిల్లాల్లో పర్యటించడానికి తీరిక దొరికిందని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం తన తొలి పర్యటనను ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవానికి పెట్టుకోవటం ఆశ్చర్యంగా ఉన్నదని తెలిపారు.

ఎంజీఎంను సందర్శించాలనే సోయిలేకుండా, కార్పొరేట్‌ దవాఖానను ప్రారంభించనుండటం బాధ కలిగించిందని వెల్లడించా రు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉన్నదని ఆరోపించారు. ప్రభుత్వ దవాఖానలు దయనీయస్థితిలో ఉన్నాయని విమర్శించారు. ఎంజీఎం దవాఖానలో ఐదు గంటల పాటు కరెంట్‌ లేకపోవటంతో రోగులు విలవిలలాడారని గుర్తుచేశారు. ఓరుగల్లు పర్యటన సందర్భంగా సీఎం ముందు పలు డిమాండ్లు ఉంచుతున్నామని రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉంచుతారా? లేదా? చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని హనుమకొండలో ఆయన పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్‌ హెచ్చరించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్‌ చంద్ర, ఉపాధ్యక్షుడు కంజర్ల మనోజ్‌ కుమార్‌, రూరల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ లంక రాజగోపాల్‌, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు కలకోట్ల సుమన్‌, గొల్లపల్లి వీరస్వామి, జిల్లా కార్యదర్శి హర్ష మధు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌లో ప్రభుత్వం చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి నిర్మాణ కాలపరిమితిని పొడిగించి పనులు చేపట్టారు. ఇప్పుడు ఆ గడువు కూడా సమీపిస్తున్నా పనుల్లో వేగం పుంజుకోవటం లేదు. పనులు పూర్తి కావాలంటే మరో ఆరు నెలలు గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరేందుకు రహదారులు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు సమాచారం. పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రభుత్వం వరంగల్‌లో 24 అంతస్తులతో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టింది. 56.39 ఎకరాల్లో మొదట రూ.1,116 కోట్ల అంచనా వ్యయంతో 1,750 పడకల కెపాసిటీతో పనులు మొదలు పెట్టింది.

Rythu Runa Mafi | రుణమాఫీకి ఎన్సీడీసీ రుణం.. భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపని జాతీయ బ్యాంకులు!

రైతు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జాతీయ బ్యాం కులతో రుణాల గురించి చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

రైతు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జాతీయ బ్యాం కులతో రుణాల గురించి చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు జాతీయ బ్యాంకులు ఆసక్తి చూపడంలేదని సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్సీడీసీ)ని సంప్రదించినట్టు తెలిసింది. రుణం ఇచ్చేందుకు తమ సంస్థ షరతులు, కేంద్ర ప్రభుత్వ అనుమతులను ఎన్సీడీసీ అధికారులు వివరించిన ట్టు తెలిసింది.

ఎన్సీడీసీ కేంద్ర సహకార శాఖ అధీనంలో ఉంటుంది. ఈ సంస్థ రుణం ఇవ్వాలంటే కేంద్ర సహకార శాఖ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర సహకార శాఖ మంత్రిగా బీజేపీ అగ్రనేత అమిత్‌షా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్సీడీసీ రుణం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్టు తెలిసింది. నాలుగు రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన రేవంత్‌రెడ్డి.. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలతోపాటు రుణమాఫీకి అవసరమైన రుణం పొందేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని పలువురు కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

రుణమాఫీకి నిధుల వేటలో భాగంగా ముంబై వెళ్లిన అధికారులు ఆర్బీఐ అధికారులతో చర్చించినట్టు తెలిసింది. ఢిల్లీలో పలు జాతీయ బ్యాంకుల అధికారులతోనూ చర్చించినట్టు సమాచారం. అయితే ఆ బ్యాంకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడారిలో ఒయాసిస్‌ మాదిరిగా ప్రభుత్వానికి ఎన్సీడీసీ కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలో ఎన్సీడీసీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను, రుణ అనివార్యతను వారికి వివరించినట్టు తెలిసింది. ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వాలని ఎన్సీడీసీని కోరినట్టు తెలిసింది. ఈ రుణం వస్తుందనే ఆశతోనే ప్రభుత్వ పెద్దలు రుణమాఫీపై ప్రకటనలు చేస్తున్నట్టు తెలిసింది

బీ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ అధికారుల ప్రకటన..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి , ఆవర్తనం కారణంగా రాష్టంలో ఈరోజు నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈరోజు అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి , ఆవర్తనం కారణంగా రాష్టంలో ఈరోజు నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈరోజు అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‎నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ఇంటేన్సిటీ స్పెల్‎తో భాగ్యనగరం మొత్తం కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడితే, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Srisailam: ‘శ్రీశైలం’లో యూనిట్‌-4కు మరమ్మతులు!

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

Srisailam: ‘శ్రీశైలం’లో యూనిట్‌-4కు మరమ్మతులు!

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జెన్‌కో చర్యలు

త్వరలో టెండర్లు నిర్వహించేందుకు కసరత్తు

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలోని 4వ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు జెన్‌కో చర్యలు చేపట్టింది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 6 యూనిట్లు ఉన్నాయి. 2020 ఆగస్టు 20న జలవిద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో కొన్ని యూనిట్లు పూర్తిగా, మరికొన్ని యూనిట్లు పాక్షికంగా కాలిపోయాయి. 4వ యూనిట్‌కే అత్యధిక నష్టం వాటిల్లింది. దీనికి జర్మనీ కంపెనీ వైత్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు చేశారు. గత ఏడాది జూలైలో 80 గంటలపాటు విద్యుదుత్పత్తి చేసిన తర్వాత ఫాల్ట్‌ రావడంతో 4వ యూనిట్‌ మళ్లీ కాలిపోయింది. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లోనే కాలిపోయినందున ఒప్పందం ప్రకారం సొంత ఖర్చుతో మరమ్మతు చేయాలని ‘వైత్‌’ గ్రూపును జెన్‌కో కోరగా, ఆ సంస్థ నిరాకరించింది. 4వ యూనిట్‌కు ఇతర మరమ్మతులు నిర్వహించడం వల్లే ఫాల్ట్‌ ఏర్పడిందని, తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఏడాదిపాటు ఈ వివాదం నడవడంతో మరమ్మతుల అంశం మరుగున పడిపోయింది. అయితే, ఈ విషయమై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. మరమ్మతులు చేపట్టాలని జెన్‌కోను ఆదేశించింది. మరమ్మతులకు రూ.3కోట్లు మాత్రమే ఖర్చు కానుండగా, అంతకు ఎన్నో రెట్లు విలువైన జల విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చన్న అంశాన్ని ప్రస్తావించింది. దీంతో మళ్లీ కొత్తగా టెండర్లు నిర్వహించడానికి జెన్‌కో యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. అయితే, మరమ్మతులు పూర్తయు 4వ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం మూడు నెలలు పడుతుందని, ఆలోగా కృష్ణాలో వరదలు తగ్గుముఖం పడుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

అన్నదాత సుఖీభవ

విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది

పేరుకే పథకం. ఎప్పుడు ఖాతాలో సొమ్ము పడుతుందో తెలియదు. ఏ తేదీన వేస్తారో.. వేయరో కూడా సొమ్ము పడేంత వరకు అనుమానమే. పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం. పైపైకి మాత్రం రైతన్నలు అంటే తనకెంతో ఇష్టం. ఈ ఐదేళ్లు ఇలా కృత్రిమంగా గడిపేశారు. రైతు భరోసా పేరిట రైతుకు సకాలంలో చెందాల్సిన సొమ్మును అందకుండా చేశారు. ఆఖరికి ఎన్నికలకు ముందు కొందరు రైతులకు ఏదో ముట్టచెప్పారు. మరికొందరికీ మొండిచేయి చూపారు. విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.

అప్పుడేమో రైతుకు దక్కని భరోసా

గడిచిన ఐదేళ్లలో జగన్‌ సర్కార్‌ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసినట్లే రైతులను వదల్లేదు. సాధా రణంగా తొలకరి ఆరంభమైన వెంటనే వ్యవసాయ పనులు ముమ్మరవుతాయి. ఆ లోపే అటు సహకార సంఘాల నుంచి రుణం కాని, ప్రభుత్వం విధాన నిర్ణయమైన ప్రత్యేక పథకం ద్వారా గాని రైతుకు సొమ్ము చేతిలో పడాలి. కాని జగన్‌ సర్కార్‌ పట్టించు కోలేదు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమలో సాగు చేసే రైతుల సంఖ్య మిగతా జిల్లాల కంటే అత్యధికమే. గడిచిన ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా ప్రకటించారు. ఏటా రూ.13 వేలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే మరో రూ.6 వేలు మొత్తం మీద కలిపి రూ.19 వేలు రైతు లకు అందిస్తామంటూ ఊదరగొట్టారు. రైతు ఖాతా లను తెరిపించారు. వ్యవసాయ సీజన్‌ ఆరంభం కాక మునుపే మే, జూన్‌ నెలల్లో గతంలో కేంద్రం ఇచ్చే మొత్తం రూ.6 వేలను మూడింటిగా విభజించి సీజ నల్‌ వారీగా రూ.2 వేలు చొప్పున రైతు ఖాతాలో పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.13 వేలు ప్రకటించగా, దీనిని రెండుగా విభజించి ఒకసారి రూ.5,500, రెండో దఫా రూ.2 వేలుగా రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాని చానాళ్ళు ఖరీఫ్‌ ఆరంభా నికి ముందే బటన్‌ నొక్కినా సొమ్ము రైతు ఖాతాల్లో జమే కాలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ నాన్చి వేసేవారు. పైకి మాత్రం అందరి ఖాతాల్లోనూ సొమ్ములు జమ చేసినట్లు గొప్పలు చెప్పేవారు. కేంద్రం ఇచ్చే వాటాను తానే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. దీనికి సమాంతరంగా సహకార సంఘా లను భ్రష్టు పట్టించారు. రైతు భరోసా కింద యాంత్రీ కరణ పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఇస్తామని చెప్పి నానా హంగామా చేశారు. ఇది కూడా కొంత మందికే పరిమితమైంది. గడిచిన ఐదేళ్ళలోనూ గోదా వరి రైతు ఎక్కడా సంతృప్తి చెందిన దాఖలాలే లేవు.

 

విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది

ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో కొత్త ఆశలు అలుముకున్నాయి. తాము అధి కార పగ్గాలు చేపట్టిన వెంటనే ఏటా రైతు ఖాతాలో రూ.20 వేలు జమ చేస్తామని, ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ను అక్షరాల నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది. రైతు ఖాతాలో గడిచిన ప్రభుత్వం ఖరీఫ్‌కు కొంత సొమ్ము జమ చేసినా కొంత మాత్రమే రైతుకు చేరింది. మిగతా సొమ్ము అంతా గప్‌చిప్‌. కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లించాలి. దీనిలో కేంద్రం వాటా రూ.6వేలు కాగా, రాష్ట్రవాటా రూ.14 వేలు, ఈ ప్రాతి పదికపై రైతుల ఖాతాల్లో సొమ్ములు చెల్లించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుభరోసా కింద అప్పట్లో రెండున్నర లక్షల మందికి పైగానే సొమ్ములు అందు కోగా, ఒక్క ఏలూరు జిల్లాలోనే లక్షా 50 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. దీనికి తోడు కౌలు రైతులు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలు ఉండగా, ఏలూరు జిల్లాలో లక్షా 30 వేల మందికి పైగానే ఉన్నారు. ఇంతకు ముందు మాదిరి కేంద్రం వాటాను మూడు వాటా లుగా విభజిస్తారా ? రాష్ట్ర వాటాను రెండు విడతలా ? లేదా ? మూడు విడతలు చేస్తారా ? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రైతుకు అవసర మైన సొమ్మును సకాలంలో అందించే ప్రయత్నం చేస్తారా ? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. తొలకరి ప్రారంభమై చానాళ్ళు అయింది. చాలామంది రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేదు. ఒకవైపు చూస్తే సొసైటీలు పడకేశాయి. ఇంకోవైపు అధికవడ్డీ ఇచ్చే వారంతా కాపు కాసుకొని కూర్చొన్నారు. వీటన్నింటి నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లోనే ఏం చేయబోతుందనేదే ప్రధాన ప్రశ్న. మరోవైపు కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు వర్తించవు. ఇదొక ప్రధాన సమస్య. ఈసారి అన్నదాత సుఖీభవలో రైతులకు సంతృప్తిని ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయి. అందుకనే వైసీపీతో విభేదించి అంతా కూటమి పక్షాన చేరారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు పెంచుకు

 

విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.

పేరుకే పథకం. ఎప్పుడు ఖాతాలో సొమ్ము పడుతుందో తెలియదు. ఏ తేదీన వేస్తారో.. వేయరో కూడా సొమ్ము పడేంత వరకు అనుమానమే. పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం. పైపైకి మాత్రం రైతన్నలు అంటే తనకెంతో ఇష్టం. ఈ ఐదేళ్లు ఇలా కృత్రిమంగా గడిపేశారు. రైతు భరోసా పేరిట రైతుకు సకాలంలో చెందాల్సిన సొమ్మును అందకుండా చేశారు. ఆఖరికి ఎన్నికలకు ముందు కొందరు రైతులకు ఏదో ముట్టచెప్పారు. మరికొందరికీ మొండిచేయి చూపారు. విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.

అప్పుడేమో రైతుకు దక్కని భరోసా

గడిచిన ఐదేళ్లలో జగన్‌ సర్కార్‌ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసినట్లే రైతులను వదల్లేదు. సాధా రణంగా తొలకరి ఆరంభమైన వెంటనే వ్యవసాయ పనులు ముమ్మరవుతాయి. ఆ లోపే అటు సహకార సంఘాల నుంచి రుణం కాని, ప్రభుత్వం విధాన నిర్ణయమైన ప్రత్యేక పథకం ద్వారా గాని రైతుకు సొమ్ము చేతిలో పడాలి. కాని జగన్‌ సర్కార్‌ పట్టించు కోలేదు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమలో సాగు చేసే రైతుల సంఖ్య మిగతా జిల్లాల కంటే అత్యధికమే. గడిచిన ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా ప్రకటించారు. ఏటా రూ.13 వేలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే మరో రూ.6 వేలు మొత్తం మీద కలిపి రూ.19 వేలు రైతు లకు అందిస్తామంటూ ఊదరగొట్టారు. రైతు ఖాతా లను తెరిపించారు. వ్యవసాయ సీజన్‌ ఆరంభం కాక మునుపే మే, జూన్‌ నెలల్లో గతంలో కేంద్రం ఇచ్చే మొత్తం రూ.6 వేలను మూడింటిగా విభజించి సీజ నల్‌ వారీగా రూ.2 వేలు చొప్పున రైతు ఖాతాలో పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.13 వేలు ప్రకటించగా, దీనిని రెండుగా విభజించి ఒకసారి రూ.5,500, రెండో దఫా రూ.2 వేలుగా రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాని చానాళ్ళు ఖరీఫ్‌ ఆరంభా నికి ముందే బటన్‌ నొక్కినా సొమ్ము రైతు ఖాతాల్లో జమే కాలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ నాన్చి వేసేవారు. పైకి మాత్రం అందరి ఖాతాల్లోనూ సొమ్ములు జమ చేసినట్లు గొప్పలు చెప్పేవారు. కేంద్రం ఇచ్చే వాటాను తానే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. దీనికి సమాంతరంగా సహకార సంఘా లను భ్రష్టు పట్టించారు. రైతు భరోసా కింద యాంత్రీ కరణ పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఇస్తామని చెప్పి నానా హంగామా చేశారు. ఇది కూడా కొంత మందికే పరిమితమైంది. గడిచిన ఐదేళ్ళలోనూ గోదా వరి రైతు ఎక్కడా సంతృప్తి చెందిన దాఖలాలే లేవు.

ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో కొత్త ఆశలు అలుముకున్నాయి. తాము అధి కార పగ్గాలు చేపట్టిన వెంటనే ఏటా రైతు ఖాతాలో రూ.20 వేలు జమ చేస్తామని, ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ను అక్షరాల నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది. రైతు ఖాతాలో గడిచిన ప్రభుత్వం ఖరీఫ్‌కు కొంత సొమ్ము జమ చేసినా కొంత మాత్రమే రైతుకు చేరింది. మిగతా సొమ్ము అంతా గప్‌చిప్‌. కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లించాలి. దీనిలో కేంద్రం వాటా రూ.6వేలు కాగా, రాష్ట్రవాటా రూ.14 వేలు, ఈ ప్రాతి పదికపై రైతుల ఖాతాల్లో సొమ్ములు చెల్లించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుభరోసా కింద అప్పట్లో రెండున్నర లక్షల మందికి పైగానే సొమ్ములు అందు కోగా, ఒక్క ఏలూరు జిల్లాలోనే లక్షా 50 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. దీనికి తోడు కౌలు రైతులు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలు ఉండగా, ఏలూరు జిల్లాలో లక్షా 30 వేల మందికి పైగానే ఉన్నారు. ఇంతకు ముందు మాదిరి కేంద్రం వాటాను మూడు వాటా లుగా విభజిస్తారా ? రాష్ట్ర వాటాను రెండు విడతలా ? లేదా ? మూడు విడతలు చేస్తారా ? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రైతుకు అవసర మైన సొమ్మును సకాలంలో అందించే ప్రయత్నం చేస్తారా ? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. తొలకరి ప్రారంభమై చానాళ్ళు అయింది. చాలామంది రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేదు. ఒకవైపు చూస్తే సొసైటీలు పడకేశాయి. ఇంకోవైపు అధికవడ్డీ ఇచ్చే వారంతా కాపు కాసుకొని కూర్చొన్నారు. వీటన్నింటి నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లోనే ఏం చేయబోతుందనేదే ప్రధాన ప్రశ్న. మరోవైపు కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు వర్తించవు. ఇదొక ప్రధాన సమస్య. ఈసారి అన్నదాత సుఖీభవలో రైతులకు సంతృప్తిని ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయి. అందుకనే వైసీపీతో విభేదించి అంతా కూటమి పక్షాన చేరారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు పెంచుకున్నారు.

కౌలు రైతులను ఏం చేయబోతున్నారు .?

గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు ప్రత్యేక కార్డులను ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో కౌలురైతులకు కార్డులు అందించడంలో ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే తొలి వరుసలో నిలిచింది. అప్పటి కలెక్టర్‌ వాణీ మోహన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వ్యవసాయంలో తగిన పరపతి అందేలా చేసేందుకు కౌలు కార్డులను నియోజక వర్గాల వారీగా లక్ష్యాలుగా తీసుకుని మంజూరు చేశారు. కాని రానురాను గడిచిన ఐదేళ్ళల్లో కౌలు రైతు పరిస్థితి మళ్ళీ అడ్డం తిరిగింది. నిత్యం చెమడోచ్చి వ్యవసాయమే లక్ష్యంగా పని చేస్తున్న కౌలు రైతులకు పరపతి లేదు, అంతకంటే మించి అధిక వడ్డీలకు ఇచ్చేవారంతా పీక్కు తినడం లోనే తొలి వరుసలో ఉన్నారు. ఈ పరిస్థితిని తట్టు కోలేక కౌలు రైతు కుటుంబాల్లో అనేకమంది ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఇవేమి అప్పటి జగన్‌ ప్రభు త్వానికి పట్టనే లేదు. కాని కూటమి మాత్రం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలురైతుకు అండగా ఉంటామని ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకంలో కౌలు రైతులను చేరుస్తారా? లేదా? అనేదే ఇప్పుడు అందరి ఎదుట ఉన్న ప్రశ్న. ఈ అంశాలన్నింటిని రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, త్వరలోనే ఖచ్చితమైన మార్గదర్శకాలు వెలువడతాయని చూఛాయగా అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో టీచర్లకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. నెరవేరిన ఎన్నో ఏళ్ల కల, ఫుల్ హ్యాపీ

Telangana Govt Teachers Promotions: తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరు విద్యా శాఖ కూడా ఉంది.. దీంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది అంటున్నారు. చట్టపరమైన అడ్డంకులు

Telangana Govt Teachers Promotions: తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరు విద్యా శాఖ కూడా ఉంది.. దీంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది అంటున్నారు. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీచర్లకు ప్రమోషన్‌లు

మొత్తం 18వేల942మందికి పదోన్నతి

సీఎం రేవంత్‌కు టీచర్ల ధన్యవాదాలు

తెలంగాణలో ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. టీచర్లకు పదోన్నతులు దక్కాయి.. గత 20 ఏళ్లుగా ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్నారి కలనెరవేరింది. మొత్తం 18వేల942మందికి ఈ పదోన్నతులు దక్కగా.. ఈ ప్రక్రియకు ఇబ్బందిగా మారిన చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిష్కరించారు. మల్టీజోన్‌-1 ప్రభుత్వ, స్థానిక సంస్థలకు సంబంధించి..

ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ - 10,083, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు - 1,094మందికి ప్రమోషన్లు దక్కాయి. మల్టీజోన్‌-2 విషయానికి వస్తే.. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ - 6,989 స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు - 776మందకి పదోన్నతలు వచ్చాయి.

విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది.. అందుకే ఉపాధ్యాయుల ప్రమోషన్లపై స్పెషల్‌గా ఫోకస్ పెట్టారు. అంతేకాదు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్‌ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మంచి జరిగింది. గురువారంతో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగియగా.. ఆన్‌లైన్‌లో అత్యంత పారదర్శకతతో పూర్తిచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పదోన్నతులు అర్హతకు తగినట్లు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం

విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది. 

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం

అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్‌

నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం

పిటిషన్‌లోని అంశాలపై నేడు విచారణ

కేసీఆర్‌ తరఫున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంధి బలమైన వాదనలు

High Court | కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం హైకోర్టు రిజస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 14న జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘాన్ని నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపించింది. కమిషన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యుత్తుశాఖ ముఖ్య కార్యదర్శిని, జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి విచారణ సంఘాన్ని, వ్యక్తిగత హోదాలో జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డిని ఇందులో ప్రతివాదులుగా పేరొన్నారు. అయితే, జస్టిస్‌ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పిటిషన్‌ గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు కు వచ్చింది.

దాదాపు 45 నిమిషాలపాటు వాదప్రతివాదనలు జరిగాయి. కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అదిత్య సోంధి బలంగా వాదనలు వినిపించారు. ఆయనతో ఏకీభవించిన ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్‌కు నం బర్‌ను కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్‌ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషనర్‌ అభియోగాలు మోపిన నేపథ్యంలో, పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే, విద్యుత్తు విచారణ సంఘం కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నదని, కమిషన్‌ తన విచారణ నివేదికను ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నదని సోంధి పేర్కొన్నారు. గడువు పమీపిస్తున్న కారణంగా విచారణపై స్టే విధించాలని ఆయన కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషన్‌కు నెంబర్‌ కేటాయింపుపై రిజిస్ట్రీ లేవనెత్తిన అంశం వరకే నేటిగురువారం విచారణ పరిమితమైందని అందువల్ల కమిషన్‌పై స్టే జారీ చేయలేమని స్పష్టం చేసింది. కేసీఆర్‌ పిటిషన్‌లోని అంశాలపై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది.

విచారణ పూర్తికాకముందే నిర్ణయానికి

కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. విచారణ ఎలా ఉండాలో కమిషన్‌ ఏర్పాటు నోటిఫికేషన్‌లోనే దిశానిర్దేశం చేసినట్టుగా ఉన్నదని, ఇది చట్ట వ్యతిరేకమని తెలిపారు. జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి కూడా ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. పిటిషనర్‌ విచారణకు హాజరుకావాలని ఏప్రిల్‌ 14న విచారణ సంఘం నోటీసులు జారీ చేసిందని, అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నందున తనకు జూన్‌ 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలంటూ కేసీఆర్‌ కమిషనర్‌కు లేఖ రాశారని వివరించారు. అయితే అంతలోనే జస్టిస్‌ నరసింహారెడ్డి ఈ నెల 11వ తేదీన విలేకరుల సమావేశం నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకొని ‘జస్టిస్‌ నరసింహారెడ్డి ప్రెస్‌కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారా?’ అని ప్రశ్నించారు. దీనికి సోంధి అవునని సమాధానం ఇచ్చారు. ‘విలేకరుల సమావేశం నిర్వహించడమే కాదు, అప్పటివరకు జరిపిన విచారణ గురించి కూడా ఆయన బాహాటంగా వెల్లడించారు. పైగా విద్యుత్‌ కొనుగోలు ధర ఎకువగా నిర్ణయించారంటూ విచారణ పూర్తికాకముందే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే విచారణలో 25 మందిని గుర్తించామని, మాజీ సీఎం కేసీఆర్‌, మరొక అధికారిని విచారణకు రావాలని నోటీసులు ఇస్తే గడువు కోరారని కూడా జస్టిస్‌ నరసింహారెడ్డి చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ ముగించకుండానే, పిటిషనర్‌ వాదనలు వినకుండానే ఏకపక్షంగా తన వైఖరిని బహిర్గతం చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’ అని సోంధి గుర్తు చేశారు. జస్టిస్‌ నరసింహారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడాన్ని తప్పుపడుతూ కేసీఆర్‌ లేఖ రాశారని సోంధి పేర్కొన్నారు. పరిధిని దాటిన కారణంగా విచారణ నుంచి తప్పుకోవాలని కోరారన్నారు. దీనిపై జస్టిస్‌ నరసింహారెడ్డి నుంచి స్పందన రాలేదన్నారు. తప్పు జరిగిపోయిందంటూ నోటీసు దశలోనే కమిషన్‌ నిర్ణయానికి వచ్చేయడాన్ని, ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కమిషన్‌ ఈ నెల 30న ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నదని తెలిపారు. ఆలోగా హైకోర్టు స్పందించాలని కోరారు

జస్టిస్‌ ఎల్‌ఎన్‌ఆరే స్వయంగా చెప్పారు

‘పీలా పోతినాయుడు ఏలేరు కుంభకోణం’పై ఏర్పాటైన జస్టిస్‌ బీకే సోమశేఖర కమిషన్‌ను సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి స్వయంగా వెలువరించిన తీర్పు ఈ కేసుకు బాగా వర్తిస్తుందని ఆదిత్య సోంధి తెలిపారు. విచారణ కమిషన్‌ బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి కాండక్ట్‌ ఉండాలని ఆ తీర్పులో పేరొన్నారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ఘటనలో విచారణ సంఘం తన బాధ్యతలను పక్షపాతంగా, ఏకపక్షంగా నిర్వర్తిస్తున్నదని, విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ యాక్ట్‌ ప్రకారం ఏర్పడే విచారణ సంఘాలకు నిర్దిష్ట బాధ్యతలు మాత్రమే ఉంటాయని రామకృష్ణ దాల్మియా కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు.

నోటిఫికేషనే లోపభూయిష్టం

విచారణ సంఘం కోసం ప్రభుత్వం వేసిన నోటిఫికేషనే లోపభూయిష్టంగా ఉన్నదని సోం ది తెలిపారు. విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాట్లల్లో అక్రమాలు జరిగాయంటూ కమిషన్‌కు దిశానిర్దేశం చేయడం తప్పు అని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కమిషన్‌ తన పరిధిని దాటి విచారణ పూర్తి కాకుండా, అసంపూర్తి సమాచారం ఆధారంగా మీడియాకు వివరాలు వెల్లడించడం దాల్మియా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకం అని సోంధి వాదించారు. కమిషన్‌ ఏం చేయబోయేదీ ముందే విలేకరులకు చెప్ప డం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు ఉండవని, కమిషన్‌ తన ఎదుట ఉన్న అంశంపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశా రు. ఈ నిబంధనను జస్టిస్‌ నరసింహారెడ్డి ఉల్లంఘించారని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు వినియోగించే సాంకేతికత వల్ల ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వస్తుందని, ఇప్పటికే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చిందని కూడా జస్టిస్‌ నరసింహారెడ్డి తేల్చేశారని పేర్కొన్నారు. దీని ద్వారా కమిషన్‌ తుది నివేదిక ఏవిధంగా ఉండబోతున్నదో కూడా స్పష్టం అవుతున్నదని సోంధి చెప్పారు. కమిషన్‌ ఏకపక్షంగా వ్యహరిస్తున్నదని చెప్పడానికి ఇవే నిదర్శమని వాదించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే జస్టిస్‌ నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేయాల్సివచ్చిందని సోంధి వివరించారు

పూర్తి వివరాలు తెలియాలి కదా?

సోంధి వాదనలు కొనసాగుతున్న దశలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి కల్పించుకున్నారు. పిటిషన్‌కు రిజిస్ట్రీ నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించిన అంశంపై వాదనలు వినిపించకుండా విద్యుత్తు వ్యవహారాలపై వాదనలు వినిపించడాన్ని వ్యతిరేకరించారు. దీనిపై సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి కల్పించుకొని.. కేసు వివరాలు చెప్తేనే జస్టిస్‌ నరసింహారెడ్డిని ఎందుకు ప్రతివాదిగా చేయాల్సివచ్చిందో తెలుస్తుందని, అందుకే వివరాలన్నీ చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేసు వివరాలు చెప్పకపోతే పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలో లేదో ఎలా నిర్ణయించగలమని ప్రశ్నించింది.

ఎస్‌ఈఆర్సీని కాదని కమిషన్‌ చెల్లదు

గత ప్రభుత్వంలో విద్యుత్తు వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని చెప్పడం, దీనికి అనుగుణంగా కమిషన్‌ పిటిషనర్‌కు 8-బీ ప్రకారం నోటీసు ఇవ్వడం చెల్లదని సోంధీ వాదించారు. మాజీ సీఎం కోట్ల విజయభాసర్‌రెడ్డి వర్సెస్‌ ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో హైకోర్టు ఈ మేరకు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని గుర్తుచేశారు. నామినేషన్‌ ప్రాతిపదికపై నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం చేకూరిందని చెప్పే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఎస్‌ఈఆర్సీ రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ Confirmation చెప్పారు. న్యాయప్రాధికార సంస్థ అ యిన ఈఆర్సీ నిర్ణయాలపై విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదన్నారు. ఎస్‌ఈఆర్సీ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని భావిస్తే, ఆప్టెప్‌లు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. ఇవేమీ చేయకుండా గత ప్రభుత్వం తప్పు చేసిందని నిర్ధారణకు వచ్చేసినట్లుగా కమిషన్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఆ తర్వాత విచారణ సంఘం వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించాలని ధర్మాసనాన్ని సోంధీ కోరారు.

వచ్చేసినట్లుగా కమిషన్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఆ తర్వాత విచారణ సంఘం వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించాలని ధర్మాసనాన్ని సోంధీ కోరారు.

రాజకీయ కక్ష సాధింపులో భాగమే

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారని సోంధి వాదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వా త విద్యుత్తు సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నామినేషన్‌ విధానంలో ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ మధ్య ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు లే దా వివాదాలపై విచారణ సంఘం వేసేందుకు వీలు లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనాలే ఆ వివాదాలపై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే భదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) అనుమతులు ఇచ్చాయని, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కాబట్టి కేవలం రాజకీయ కక్షతోనే ఏదో తప్పు జరిగిందని చూపేందుకు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతిష్ఠాత్మకమైన బీహెచ్‌ఈఎల్‌ ద్వారా పనులు చేయించుకునేందుకు నామినేషన్‌ విధానాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు. సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ, సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వ్యవహారంపై కూడా కమిషన్‌ తన వైఖరిని వెల్లడించడం చెల్లదని వాదించారు. ఏది మంచో, ఏది ఉత్తమ మో బహిరంగంగా చెప్పే అధికారం కమిషన్‌కు లేనేలేదని స్పష్టం చేశారు. కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవని చెప్పారు. కమిషన్‌ కేవలం ప్రభుత్వానికి సిఫార్సులతో కూడిన నివేదిక మాత్రమే ఇవ్వాలని సోంధీ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా

గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, మాజీ సీఎం కే విజయభాసర్‌రెడ్డి మధ్య జరిగిన కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ తీరు ఉన్నదని సోంధి వాదించారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 8(3) విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని తెలిపారు. ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పులో కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవని చెప్పిందని గుర్తుచేశారు. విచారణ సంఘం విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వాలని, ఎవరికైనా శిక్షలు విధించడం, జరిమానాలు విధించడం వంటి ఉత్తర్వుల జారీ అధికారం కమిషన్‌కు ఉండవని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఉదాహరణకు మానవ హకుల కమిషన్‌ సిబ్బందికి జీతాలు చెల్లించాలన్న ఉత్తర్వులను రాజ్యాంగ ధర్మాసనాలు రద్దు చేశాయని గుర్తు చేశారు. కమిషన్‌ న్యాయ నిర్ణయాలు వెల్లడించేందుకు చట్టంలో వెసులుబాటు లేదని వివరించారు