NLG: విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు అందజేసిన ఆరోగ్య సిబ్బంది

నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఇవాళ జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నివారణకు ఆల్బండజోల్ టాబ్లెట్స్ విద్యార్థులకు వేశారు.
ఈ సందర్భంగా ఏఎన్ఎం స్వర్ణలత, ఆశ వర్కర్ ఏర్పుల పద్మ మాట్లాడుతూ.. 1 నుండి 19 సం.ల వయస్సు గల పిల్లలందరు నులిపురుగుల నివారణకు ఆల్బండజోల్ టాబ్లెట్లు వాడాలని తెలియజేసి టాబ్లెట్లు విద్యార్థులకు అందజేశారు.
కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి, హెచ్ఎం యాదగిరి, టీచర్లు వెంకటేష్, యాదయ్య, శ్యామల, అపర్ణ సౌజన్య, జానకి, తదితరులు పాల్గొన్నారు. 
Jun 22 2024, 14:31