చేనేత సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి...వస్త్రాల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి..
చేనేత సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
వస్త్రాల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతి కుమార్ గంజి మురళీధర్ డిమాండ్ చేశారు
సోమవారం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మనదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా కాస్తో కూస్తో చేనేతకు ఉపయోగపడే హ్యాండ్లూమ్ బోర్డును, పవర్లూమ్ బోర్డ్ ను, మహాత్మా గాంధీ బున్కల్ యోజన పథకాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. చేనేత వస్త్రాలపై రంగులు రసాయనాలు నూలు కొనుగోలు చేయడానికి జీఎస్టీ విధించి మరింత ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. 2013 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘాల ఎన్నికలు ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగిసిన ఆరు నెలలకు ఒకసారి పర్సనల్ ఇన్చార్జిల నియమించి పొడిగించడం పొడిగించుకుంటూ ఇప్పటికి 9 సార్లు పొడిగించడం వలన సహకార సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా అన్ని సంఘాలకు సహకార ఎన్నికల నిర్వహించి బడ్జెట్లో నిధులు కేటాయించి సంఘాల బలవపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాల మరియు మాస్టర్ వీవర్స్ దగ్గర కోట్లాది రూపాయల విలువ కలిగిన వస్త్రాలు నిలువలు పేరుకపోయాయని మగ్గాలు నడపలేక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో చేనేత వస్త్రాల కొనుగోలు ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ ఫoడ్, చేనేత మిత్ర పథకాలకు నిధులు కేటాయించి షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ సిబ్బంది యూనిఫామ్ లకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, గురుకులాలు ,ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫారాలకు చేనేత వస్త్రాలు అందజేసి చేనేత కార్మికులకు పని కల్పించి ఆదుకోవాలని కోరారు. చేనేత కార్మికులకు వర్క్ షెడ్ తో కూడిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, చేనేత సహకార సంఘాలకు, చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి వెంటనే 80 శాతం సబ్సిడీ ద్వారా రెండు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని కోరారు. చేనేత రంగ అభివృద్ధికి బడ్జెట్లో 2000 కోట్లు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య చేనేత కార్మిక సంఘం నాయకులు రాపోలు రాములు ,రాపోలు వెంకన్న కర్నాటి శ్రీరంగం గడ్డం దశరథ వాలిగొండ మధు బొల్లు రవీంద్ర కుమార్,శివ, తదితరులు పాల్గొన్నారు.



బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. రంగపాణి-నిజ్బారి స్టేషన్ల మధ్య గూడ్స్ రైలును ఢీకొన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు, ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడివున్న బోగీలు, కొనసాగుతోన్న సహాయక చర్యలు
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,870 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 42,119 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4 కోట్లు
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు


తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు..
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. హోంశాఖ-వంగలపూడి అనిత, చంద్రబాబు-సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, పవన్ కళ్యాణ్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అచ్చెన్నాయుడు- వ్యవసాయం.. కొల్లు రవీంద్ర- గనులశాఖ, నాదెండ్ల మనోహర్- పౌరసరఫరాల శాఖ, పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి, సత్యకుమార్- ఆరోగ్యశాఖ, నిమ్మల రామానాయుడు- జలవనరులు, నారా లోకేశ్- మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్
కుల, మత రహితంగా పాఠశాల రికార్డుల తయారీపై కౌంటరు దాఖలు చేయండి
Jun 18 2024, 19:25
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.6k