సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల పూర్తి కావడంతో ఉద్యోగ నియామకాల్లో టీజీపీఎస్సీ (TGPSC) దూకుడును పెంచింది. ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పరీక్షలను జూన్ 24 నుంచి 29వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్ ఆధారిత (CRBT)విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందు నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
₹లక్షన్నర జీతం.. సెబీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా?
ఇక పోస్టుల విషయానికి వస్తే.. అత్యధికంగా ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులున్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 13 ఖాళీలు ఉన్నాయి.
ఖాళీలు ఇలా...
గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారులు గ్రేడ్-1 - 5; గ్రేడ్-2 - 106
ఎస్సీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్-2 (మహిళ) - 70; గ్రేడ్-2 (పురుషులు) - 228
బీసీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్-2 - 140
దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్ గ్రేడ్ -1 - 5; వార్డెన్ గ్రేడ్-2 - 3
దివ్యాంగుల సంక్షేమశాఖలో మాట్రన్ గ్రేడ్-1 - 3; మాట్రన్ గ్రేడ్-2 - 2
చిన్నారుల సంరక్షణ గృహాల్లో లేడీ సూపరింటెండెంట్లు - 19




తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు..
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. హోంశాఖ-వంగలపూడి అనిత, చంద్రబాబు-సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, పవన్ కళ్యాణ్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అచ్చెన్నాయుడు- వ్యవసాయం.. కొల్లు రవీంద్ర- గనులశాఖ, నాదెండ్ల మనోహర్- పౌరసరఫరాల శాఖ, పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి, సత్యకుమార్- ఆరోగ్యశాఖ, నిమ్మల రామానాయుడు- జలవనరులు, నారా లోకేశ్- మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్
కుల, మత రహితంగా పాఠశాల రికార్డుల తయారీపై కౌంటరు దాఖలు చేయండి
అమరావతి: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ.. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..
కువైట్ అగ్నిప్రమాద ఘటనలో 45 మంది భారతీయులు మృతి
వాళ్లుఅర్హులా?... అనర్హులా...?
ములుగు జిల్లా ఏజెన్సీలో పేలిన మరో మందుపాతర
Jun 17 2024, 06:55
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.9k