/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz హరీష్ రావుకు నోటీసులు ! Yadagiri Goud
హరీష్ రావుకు నోటీసులు !

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బ్యారేజీల నిర్మాణంపై విచారణ ఊపందుకుంది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు.

టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత భారీ నీటిపారుదల శాఖా మంత్రి, ముఖ్యమంత్రిని విచారణకు పిలుస్తామని వెల్లడించారు.

జూలై రెండో వారం లేదంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు త్వరలో నోటీసులు అందే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసీఆర్‌కు ఇస్తారని తెలుస్తోంది.

అంతకుముందు కాళేశ్వరం కమిషన్‌ను హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజనీర్లు కలిశారు. మధ్యంతర నివేదిక రెండు వారాల్లో సమర్పించాలని నిపుణులకు కమిషన్ స్పష్టం చేసింది. పూర్తిస్థాయి నివేదిక వీలయినంత త్వరగా అందజేయాలని రెండు కమిటీల ఇంజనీర్లకు కాళేశ్వరం కమిషన్ సూచించింది. టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయంలో అఫిడవిట్ ఫైల్ చేయాలని నిపుణుల కమిటీలకు కాళేశ్వరం కమిషన్ సూచించింది. త్వరలో మరోసారి ఫీల్డ్ విజిట్ చేస్తామని జస్టిస్ చంద్ర ఘోష్ వివరించారు.

అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని బహిరంగ విచారణలో భాగస్వామ్యం చేస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్ర ఘోష్ స్పష్టం చేశారు. విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కమిషన్ ఇప్పటికే కోరింది. విజిలెన్స్ రిపోర్ట్ అందకపోవడంతో మరోసారి ప్రభుత్వానికి లేఖ రాయనుంది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై టెక్నికల్ అంశాలు పూర్తయిన తర్వాత ఆర్థికపర అంశాల మీద కమిషన్ దృష్టిసారించే అవకాశం ఉంది.

వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య కల్పించాలి

మహబూబాబాద్ జిల్లాలోనీ పత్రికల్లో మీడియా లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని కోరుతూ బుధవారం తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

 స్పందించిన జిల్లా కలెక్టర్ జర్నలిస్టులకు న్యాయం చేస్తానని హామీ ఇస్తూ జిల్లా విద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు అనంతరం డిఇఓ కూడ వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.

ఇందుకు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా సహకరించాలని కోరారు చాలా జిల్లాలలో జర్నలిస్టులకు ప్రైవేటు పాఠశాలలతో ఉచిత విద్య అవకాశం కల్పిస్తున్నప్పటికీ మహబూబాబాద్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా కొనసాగుతుందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 అలాగేజిల్లాలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు కూడా జర్నలిస్టుల పక్షాన స్పందించి ప్రవైట్ పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించే విధంగా విద్యాశాఖ పై ఒత్తిడి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు  ప్రతి సంవత్సరం జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాటలలో కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందేలా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పక్షాన ప్రత్యేకమైన జీఓ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల జర్నలిస్ట్ సంఘం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహదేవ్ జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు అశోక్ సంఘం నాయకులు కొప్పుల శ్రీనివాస్ గండమల్ల రోశయ్య కమటం నాగేశ్వరరావు కార్తీక్ లు పాల్గొన్నారు.

గిరిజనులకు రిజర్వేషన్లు తగ్గిస్తే దండయాత్రే!

•లంబాడి హక్కుల పోరాట సంఘం LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్

•జనాభా ప్రతిపదికన ప్రభుత్వ శాసనం G.O 33 ద్వారా ఇచ్చిన ST రిజర్వేషన్ పది శాతం ఉండాల్సిందే

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సంఘం LHPS ఆధ్వర్యంలో  నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం డిఎస్ బాలు నాయక్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ శాసనం ద్వారా జీవో నెంబర్ 33 ద్వారా ఇచ్చిన ST రిజర్వేషన్ 10 శాతం ఉండాల్సిందే రిజర్వేషన్ శాతం తగ్గించాలని గిరిజనులకు అన్యాయం చెయ్యాలని చేసే కుట్రలను తిప్పికొట్టాలి అని అన్నారు అదేవిధంగా G.O 3 కూడా అమలు చేసేదాకా కొట్లాడాల్సిన అవసరం మనకు ఉంది అని అన్నారు హైకోర్టులో గిరిజన వ్యతిరేకులు వేసిన పిల్ కు వ్యతిరేకంగా పోరాడుదాం గిరిజనులు అందరం కలిసి హక్కులు సాధించుకుందాం అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని తండాలను రెవిన్యూ గ్రామపంచాయతీలుగా గుర్తించాలని తండాల అభివృద్ధికి 100 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరారు గిరిజనులపై దళితులపై అగ్రవర్ణాల దాడులు ఆగాలంటే ఎస్సీ ఎస్టీ కేసులను అమలు చేయాలని కేసులు నమోదు చేయాలని కోరారు  ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పాపావత్ గోపి నాయక్ బానోతు శ్రీను నాయక్ బాదావత్ యశ్వంత్ తేజావత్ వినోద్ నాయక్ డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కొరవి మండల ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడుగా భానోత్ శ్రీను నాయక్ ఎన్నుకున్నారు.

నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ....

- యుద్ధప్రాతిపదికన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

- ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలి

- ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధా అయింది...ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయండి

- పదిరోజుల్లో మళ్ళీ వస్తా... పనుల్లో పురోభివృద్ధి లేకపోతే బాధ్యుల పై చర్యలు.... పనుల్లో నాణ్యత లోపించిన ఊరుకునేది లేదు

- రెవెన్యూ అధికారులు మున్నేరు కు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించండి

- గోళ్ళపాడు సైడ్ డ్రెన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్ లను నిర్మించండి... 

- స్టార్టింగ్ పాయింట్... ఎండింగ్ పాయింట్ లను గుర్తించి సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులను చేపట్టాలి... తద్వారా మురికి నీరు మున్నేరు లో చేరకుండా ఉంటుంది.

నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ..

ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. 

రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశం.. 

ఇప్పటికే నీట్‌పై కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం.. 

1563 మంది అభ్యర్థుల ర్యాంకులపై అనుమానాలు.. 

1563 మంది ర్యాంకులను నిలిపివేశామని కోర్టుకు తెలిపిన ఎన్టీఏ.. 

విద్యార్థులకు తిరిగి పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నామన్న ఎన్టీఏ.. 

గ్రేస్ మార్కులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు.

తిరుమలలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు - ప్రధాని మోదీ, అమిత్ షా సహా ప్రముఖులంతా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు - రాష్ట్ర చరిత్రలో 93 శాతం స్ట్రెకింగ్ రేటు విజయం ఎప్పుడూ రాలేదు - ఎన్నో విజయాలు చూశాం.. ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు -

వెంకటేశ్వరస్వామి మా ఇంటి కుల దైవం - సీఎం అయిన తర్వాత స్వామిని దర్శించుకున్నా - దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది - శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నా - వెంకటేశ్వరస్వామి నన్ను బ్రతికించారు -

తెలుగు జాతికి సేవ చేయాలని స్వామివారు ప్రాణభిక్ష పెట్టారు - రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాను - ప్రపంచంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలనేది నా తపన - ప్రస్తుతం దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది - సంపద సృష్టించాలి.. అది పేదవాడికి అందాలి - ఆర్థిక అసమానతలు లేకుండా చూడాలి - ఆర్థిక అసమానతలను తొలగించడమే మా ధ్యేయం - 1995లో సీబీఎన్ పాలన ప్రారంభమైంది -

అంతకుముందు పరిపాలన సచివాలయం నుంచే సాగింది - నేను అధికరంలోకి వచ్చాక ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చా - మా పాలన చూసి ప్రపంచ నేతలు హైదరాబాద్‍కు రావడం మొదలుపెట్టారు - మంచి పాలన అందిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందనేందుకు అదే ఉదాహరణ - భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థ కుటుంబ వ్యవస్థ - కుటుంబం శక్తి, రక్షణ, ఆనందాన్నిస్తుంది - కష్టాలు పంచుకునే భాగస్వాములు కుటుంబంలోనే ఉంటారు -

గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయింది - టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా - తిరుమలలో గోవిందా నామ నినాదాలు తప్ప మరేమి వినపడకుండా చేస్తా - ప్రజాపాలన వచ్చింది.. ప్రజలకు రుణపడి ఉంటా - రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తా - ఏపీని అభివృద్ధిలో నెం.1 చేస్తా - అమరావతి విధ్వంసమైంది.. పోలవరాన్ని నీళ్లలో ముంచేశారు - అమరావతి, పోలవరాన్ని చక్కదిద్ది.. పూర్తి చేస్తా - నేను అందరివాడిని.. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా : సీఎం చంద్రబాబు

నేడు బాధ్యతలు స్వీకరించనున్న బండి సంజయ్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ గురువారం ఉదయం 10.35 నిమిషాలకు బాధ్యతలు చేపట్టనున్నారు. నార్త్‌ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

భద్రతా కారణాల వల్ల కార్యకర్తల హడావిడి, నాయకుల సందడి లేకుండా సంజయ్‌ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఈ కార్యక్రమానికి హాజరై బండి సంజయ్‌కి ఆశీస్సులు అందించనున్నారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కిషన్‌ రెడ్డికి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి కార్మికులకు మరింత మేలు చేసే విధంగా కిషన్‌ రెడ్డి కృషి చేస్తారని బండి సంజయ్‌ ఆకాంక్షించారు.

కేబినెట్లో పిన్న వయస్కురాలిగా అనిత!

చంద్రబాబు కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత (40) నిలిచారు. 

ఆమె తర్వాత నారా లోకేశ్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు.

 70 ఏళ్లు దాటిన మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్ (75), చంద్రబాబు (74), ఆనం రామనారాయణరెడ్డి (71) ఉన్నారు. 

అలాగే 50 నుంచి 70 ఏళ్ల మధ్యలో 15 మంది మంత్రులు ఉన్నారు.

ఏపీ మంత్రిగా పవన్‌ కల్యాణ్ ప్రమాణ స్వీకారం..

ఏపీ మంత్రిగా పవన్‌ కల్యాణ్ ప్రమాణ స్వీకారం.. 

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం..

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.