వాళ్లుఅర్హులా?... అనర్హులా...? గురుకుల నియామకాలపై తర్జనభర్జన..
వాళ్లుఅర్హులా?... అనర్హులా...?
గురుకుల నియామకాలపై తర్జనభర్జన
విద్యార్హతల నిర్ధారణపై ట్రిబ్‌కు అస్పష్టత
కోర్టుకు బాటనీ జేఎల్ అభ్యర్థులు
అర్హతలపై విద్యామండలికి ట్రిబ్ లేఖ
3 నెలలుగా అభ్యర్థుల ఎదురుచూపులు
హైదరాబాద్, జూన్13: తెలంగాణ గురుకుల విద్య సంస్థ నియామక మండలి (ట్రిబ్) నోటిఫికేషనలో ఒకటి పేర్కొని, నియామక ప్రక్రియలో మరోవిధంగా నడుచుకొన్నదని అభ్యర్థులు మండిపడుతున్నారు. పలు పోస్టుల విద్యార్హతలకు సంబంధించి దేనిపైనా స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు బోర్డు మాత్రం అభ్యర్థులు లేవనెత్తిన ఆయా విద్యార్హతల అంశాలపై ఉన్నత విద్యామండలికి లేఖ రాసి చేతులు దులుపుకొన్నది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మూడునెలలుగా సదరు అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు.
నోటిఫికేషన్‌కు విరుద్ధంగా జేఎల్ బాటనీ
ట్రిబ్ 160 బాటనీ జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సమయంలో ఆ పోస్టులకు బాటనీతోపాటు బయోటెక్నాలజీ, మైక్రోబయోలజీ, మెరైన్ బయోలజీ, బయో సైన్స్, మాడ్రన్ బయోలజీ, ప్లాంట్ సైన్స్‌లో ఎమ్మెస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులని ట్రిబ్ పేర్కొన్నది. ఈ మేరకు జేఎల్ పోస్టులకు సంబంధించి 1ః2 మెరిట్ జాబితాను విడుదల చేసింది. డెమోలకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. ఎంఎస్సీతోపాటు డిగ్రీలో కూడా బాటనీ చదివి ఉండాలంటూ అనేక మంది అభ్యర్థులను కనీసం డెమోకు కూడా ట్రిబ్ అనుమతించలేదు. నోటిఫికేషన్‌కు విరుద్ధంగా మైక్రోబయోలజీ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి చేసిన వారే జేఎల్ బాటనీకి అర్హులని కొంతమంది అభ్యర్థులను తిరస్కరించింది. అటు తరువాత తుది జాబితాను ప్రకటించింది. దీంతో బాధిత అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే వాదనలు విన్న అనంతరం నోటిఫికేషన్ ప్రకారం జేఎల్ బాటనీ పోస్టుకు యూనివర్సిటీతో సంబంధం లేకుండా మైక్రో బయోలజీ అభ్యర్థులు కూడా అర్హులని ఎంపిక చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఈ తీర్పు అనంతరం ఇదే తరహా అభ్యర్థనతో మరికొందరు కోర్టును ఆశ్రయించగా, అందుకు అవే ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు వెల్లడించింది. ఇదే తరహాలో మరికొంత మంది సైతం వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఇప్పటికే కోర్టు ను ఆశ్రయించారు. దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఈ విద్యార్హతలకు సంబంధించి ట్రిబ్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. విద్యార్హతలను తేల్చాలని కోరుతూ ఉన్నత విద్యామండలికి లేఖరాశామని, వారి మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తామని ట్రిబ్ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఈ అంశం ఎటూ తేలకపోవడంతో దాదాపు 3 నెలలుగా అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. మరోవైపు ఆయా సొసైటీలు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చే ప్రక్రియను చేపడుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఈ అంశాన్ని తేల్చాలని ట్రిబ్‌ను డిమాండ్ చేస్తున్నారు.

వాళ్లుఅర్హులా?... అనర్హులా...?

ములుగు జిల్లా ఏజెన్సీలో పేలిన మరో మందుపాతర
అమరావతి: ఇవాళ సాయంత్రం సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్‌లో సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్న సీఎం చంద్రబాబు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్న చంద్రబాబు.. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్న చంద్రబాబు. 


నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ చంద్రబాబు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు.. కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు.. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీ.. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Jun 14 2024, 08:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.0k