గిరిజనులకు రిజర్వేషన్లు తగ్గిస్తే దండయాత్రే!
•లంబాడి హక్కుల పోరాట సంఘం LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్
•జనాభా ప్రతిపదికన ప్రభుత్వ శాసనం G.O 33 ద్వారా ఇచ్చిన ST రిజర్వేషన్ పది శాతం ఉండాల్సిందే
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సంఘం LHPS ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం డిఎస్ బాలు నాయక్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ శాసనం ద్వారా జీవో నెంబర్ 33 ద్వారా ఇచ్చిన ST రిజర్వేషన్ 10 శాతం ఉండాల్సిందే రిజర్వేషన్ శాతం తగ్గించాలని గిరిజనులకు అన్యాయం చెయ్యాలని చేసే కుట్రలను తిప్పికొట్టాలి అని అన్నారు అదేవిధంగా G.O 3 కూడా అమలు చేసేదాకా కొట్లాడాల్సిన అవసరం మనకు ఉంది అని అన్నారు హైకోర్టులో గిరిజన వ్యతిరేకులు వేసిన పిల్ కు వ్యతిరేకంగా పోరాడుదాం గిరిజనులు అందరం కలిసి హక్కులు సాధించుకుందాం అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని తండాలను రెవిన్యూ గ్రామపంచాయతీలుగా గుర్తించాలని తండాల అభివృద్ధికి 100 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరారు గిరిజనులపై దళితులపై అగ్రవర్ణాల దాడులు ఆగాలంటే ఎస్సీ ఎస్టీ కేసులను అమలు చేయాలని కేసులు నమోదు చేయాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పాపావత్ గోపి నాయక్ బానోతు శ్రీను నాయక్ బాదావత్ యశ్వంత్ తేజావత్ వినోద్ నాయక్ డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కొరవి మండల ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడుగా భానోత్ శ్రీను నాయక్ ఎన్నుకున్నారు.
Jun 13 2024, 16:22