చర్ల: భద్రాచలం: నకిలీ విత్తనాలను అరికట్టాలి మరియు అమ్మిన వ్యాపారస్తులపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలనీ తాసిల్దార్కు వినతి పత్రం అందజేత..
నకిలీ విత్తనాలను అరికట్టాలి,అమ్మిన వ్యాపారస్తులపై పిడియాక్ట్ కేసు నమోదు చేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్లలో ప్రదర్శనర్యాలీ ధర్నా తహసిల్దార్ కు వినతి పత్రం
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నకిలీ విత్తనాలను అరికట్టాలని అమ్మిన వ్యాపార వర్గాలపై పిడియక్ట్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఈరోజు చర్ల మండల కేంద్రంలో ప్రదర్శన తహసిల్దార్ కార్యాలయం ధర్నా అనంతరం తాహాసిల్దార్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమం కు చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ 1 కోటి 60 లక్షల మంది రాష్ట్రంలో వ్యవసాయం సాగు చేసుకుంటుండగా అందులో 60 లక్షల మంది రైతులు పత్తి మిరప వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు.వీరికి సరిపడా విత్తనాలు సరఫరా చేయలేక కొంతమంది వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను సరఫరా చేసి రైతులని మోసం చేస్తున్నారని అలాంటి వ్యాపార వర్గాలపై పిడి కేసులు నమోదు చేయాలని వారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాగానే పాత రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని అన్ని దేశాలలో ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్టుగా ఈ భారత దేశంలో కూడా ఇవ్వాలని వారు కోరారు.వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నకిలీ విత్తనాలు అరికట్టాలని పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తున్న వ్యాపార వర్గాలపై చర్యలు తీసుకోవాలని పంట బీమా,బి3 పత్తి విత్తనాల నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని,భూసార పరీక్షలు చేయాలని,సహకార సంఘాల ద్వారా ఎరువులు విత్తనాలు పురుగుమందులు సరఫరా చేయించాలని వారన్నారు.తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు రైతులు విత్తనాలు కొంటె రసీదులు ఇచ్చేటట్టుగా ఏ పంట పండుతుందో భూసార పరీక్షలు చేసేటట్టుగా వారిని చైతన్య పరచాలని వారు కోరారు.ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ నాయకులు కల్లూరి నర్సింగరావు,ఆదిలక్ష్మి,ఇర్ప సమ్మక్క,బొర్రా సమ్మక్క,కోట నాగమణి,కనకమ్మ ,శ్రీదేవి,బాయమ్మ,కల్లూరి నాగమని ,సబక నాగలక్ష్మి,వెంకటరమణ,జ్యోతి,కల్లూరు జయ,రామలక్ష్మి,ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.





నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ చంద్రబాబు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు.. కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు.. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీ.. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
హైదరాబాద్: పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే.. పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి.. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,744 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 36,833 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు
Jun 13 2024, 07:38
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.7k