Kaleshwaram Project: నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం
- నెలలో పూర్తి చేద్దామంటున్న అధికారులు
- మూడు బ్యారేజీల బాధ్యత 3 కేంద్ర సంస్థలకు
- రేవంత్ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం
- రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి
- సర్టిఫికెట్లిచ్చినా నిర్మాణం పూర్తికానట్లే లెక్క
- సీఎం స్పష్టీకరణ.. వారంలో కాళేశ్వరానికి
- రేవంత్ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం
- మరమ్మతు ఖర్చు నిర్మాణ సంస్థలదే
- అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరణ
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స)తో, అన్నారం బ్యారేజీని పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో, సుందిళ్ల బ్యారేజీని హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఏ)తో అధ్యయనం చేస్తున్నారు . బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై ఈ మూడు సంస్థలతో భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయించాలని సూచిస్తూ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చింది.
నివేదికపై శనివారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, అధికారులు చర్చించారు. ఇతర మంత్రులు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి?
బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలేంటి? ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డ్డి ఆరా తీశారు. బ్యారేజీల అధ్యయనంతో పాటు రిపేర్లు ఏకకాలంలో చేపట్టాలని నిర్దేశించారు. సమాంతరంగా చేపట్టడం వల్ల నాలుగు వారాల్లోగా మరమ్మతులు, పరీక్షలు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. పరీక్షలపై నోడల్ అధికారిగా నీటి పారుదల శాఖలోని డిజైన్ల విభాగం చీఫ్ ఇంజనీరును నియమించాలని శనివారం నాటి సమావేశంలో నిర్ణయించారు.
కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకొని, వెనువెంటనే అధ్యయనం చేసేలా చూడాలని నిర్దేశించారు. ఆనకట్టల భద్రత జాతీయ సంస్థ నివేదిక ప్రకారం మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. బ్యారేజీల మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థలదేనని స్పష్టం చేశారు.
Jun 06 2024, 13:59