/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz భద్రాచలం: చర్ల: ఏ పార్టీ గెలిచిన ఓడేది ప్రజలే: ముసలి సతీష్(PYL) Miryala Kiran Kumar
భద్రాచలం: చర్ల: ఏ పార్టీ గెలిచిన ఓడేది ప్రజలే: ముసలి సతీష్(PYL)

ఏ పార్టీ గెలిచినా ఓడేది ప్రజలే!

ముసలి సతీష్ 

ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ పోతుంది? దేనికి ఎన్ని సీట్లు? ఎన్ని? ఇన్నా? అన్నా? అన్నేనా? చర్చలు! చర్చలు! వాదాలు! కాలక్షేపపు వాదాలు! ఎన్ని చేసినా పార్టీల సమర్ధకులైతే ఫరవాలేదు! కానీ, మేధావులు! ఆలోచనాపరులు! పత్రికల్లో! టీవీల్లో! ఎన్నికల ఫలితాలకోసం రాత్రింబవళ్ళూ కబుర్లు! ఏ పార్టీ? ఏ పార్టీ? శ్రమ దోపిడీనే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీల్లో ఏదో ఒక పార్టీ కోసం వెతుకులాటా, నిరీక్షణా!

ఇప్పుడున్న ఎన్నికల తంతునీ, అమలులో వున్న రాజ్యాంగాన్నీ, చలామణీలో వున్న ప్రజాస్వామ్యాన్నీ మేధావులు కూడా పసిపిల్లలకన్నా అమాయకంగా నమ్ముతూ అంచనాలు కడుతున్నారు. ఈ మేధావులు, ప్రజలకు మేలు చేసే పార్టీ ప్రభుత్వం వస్తే బాగుండునని కోరుకుంటారు. తక్షణ ఉపశమనం గురించి మాత్రమే ఆలోచించే అల్పసంతోషులైన వీరు, శ్రమ దోపిడీ విషయాలను కనీసంగా కూడా ఎత్తరు. ఉన్న పరిస్తితుల్లో, ఎప్పటికప్పుడు తక్షణ ఉపశమనాల గురించే ఆలోచిస్తే, దీర్ఘకాలిక పరిష్కారం గురించి ఎప్పుడు? ‘శరీరంలో పెద్ద జబ్బు యేదో వున్నా, తలనొప్పిని పట్టించుకోకూడదా?’ అంటారు. నిజమే. తాత్కాలిక సమస్యల్ని కూడా పట్టించుకుంటేనే ఒక అడుగు ముందుకు వెయ్యగలం. అయితే, అసలు జబ్బు సంగతి ఎప్పుడు? తల నొప్పీ, ఈ నొప్పీ, ఆ నొప్పీ రావడం అసలు జబ్బువల్లే అయితే, జబ్బుతో సంబంధం లేకుండా చిన్న నొప్పులు రాకుండా చూడడం సాధ్యమేనా? ‘శ్రమ దోపిడీ’ అనే జబ్బువేపు ఎప్పుడు చూస్తారు? అది సాధారణ ప్రజలకు తెలీదు. మేధావులకీ తెలీదా? దాని గురించి ప్రజలకు ఎప్పుడు తెలుపుతారు?

ప్రజానుకూల మేధావులకు దురుద్దేశాలను ఆపాదించలేము. కానీ, ఆ విషయాల్ని పైపైనే చూసే, రాసే రాతలూ, ఎన్నికల్లో సీట్ల సంఖ్యలూ, ప్రజల్ని భ్రమల్లోనే వుంచుతాయి. మేధావులు కూడా భ్రమల్లో ఉండడానికే అలవాటై పోతున్నారా? ఎన్నికల్లో నిలబడ్డ పార్టీల్ని, అధికారంలో వున్నా, లేకపోయినా, ప్రతీ ఒక్క పార్టీనీ వేరు వేరు స్వభావాలతో, వేరు వేరు లక్ష్యాలతో వున్నదాన్నిగా, ఈ మేధావులు భావిస్తారు. ఆ భావనలు నిజం కావని ఆ పార్టీలు అమలు చేసే విధానాల్ని బట్టి తెలిసిపోతుంది. ‘ప్రైవేటీకరణ’ విధానాన్ని ప్రతీ పార్టీ అమలు చేస్తుంది, కాకపోతే, కొన్ని హెచ్చు తగ్గులతో! ఉద్యోగ భద్రత పోయి, ప్రైవేటు యజమానుల దయాదాక్షిణ్యాల మీద బతికే జీవితాన్నే ఇస్తాయి పార్టీలు. అలాగే, ‘సరళీకరణ’ పేరుతో ఏమి చేస్తారో చూడండి: వాతావరణ కాలుష్యం జరగరాదనే దృష్టి గానీ, పని పరిస్తితుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు వుండాలనే దృష్టిగానీ, ఏదీ లేకుండా, పరిశ్రమలకు తేలిగ్గా (సరళంగా) అనుమతులిచ్చేసే పార్టీలే కదా ఇవి! పైగా, దోపిడీదారులకే భూముల్ని అడ్డగోలుగా నామమాత్రపు ధరలకు ఇవ్వడాలూ, కరెంటూ–నీళ్ళూ ఉచితంగానో, చవగ్గానో ఇవ్వడాలూ! ‘ప్రపంచీకరణ’ పేరుతో, విదేశీ కంపెనీలకు ఇక్కడి తలుపులూ, కిటికీలూ తెరిచి పెట్టడం! ఈ విధానాల్ని తిరస్కరించే పార్టీ ఒక్కటైనా వుంటుందా?

‘స్వతంత్రం! స్వతంత్రం వచ్చేసింది! పోరాడి సాధించాం’– అంటారు! నిరుద్యోగ సమస్యకి పరిష్కారాన్ని సాధించారా? 75 ఏళ్ళగా వుంటూనే వుందే! ఏ సమస్యకైనా, ఏ దరిద్రానికైనా కారణం, శ్రమ దోపిడీని పెద్ద స్తాయిలో నడిపించే ‘పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానమే’ అని గ్రహించలేరా మన ప్రజానుకూల మేధావులు? గ్రహించినా ప్రజలకు తెలపలేరా? ధరల పెరుగుదలకు కారణమేమిటో గ్రహించినా బైటపెట్టలేరా? తిండీ, బట్టా, నివాసమూ, విద్యా, వైద్యమూ అనే కనీస అవసరాల్ని తీర్చని విషయంలో పార్టీల మధ్య ఏమిటి తేడా? దేశంలో కలిమి అంతా ఒక వర్గం దగ్గిరా, లేమి అంతా ఇంకో వర్గం దగ్గిరా పోగుపడడానికి ఈ పార్టీలు కారణమని మేధావులకి తెలీదా? కోటి రూపాయలతో కార్లు కొనేవాళ్ళు ఒక వేపూ, పొట్టకూటికోసం ప్రాణాలకి తెగించి డ్రయినేజీ గోతుల్ని శుభ్రం చేసేవాళ్ళు ఇంకోవేపూ వుండడానికి ఈ పార్టీలు కారణం కాదా?

‘రాజ్యాంగాన్ని రక్షించాలి!’ అంటారు. అసలు రాజ్యాంగమే అనేక అసమానతలకి మూలం. ఇతరుల శ్రమని దోచి, లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ అనే ఆదాయాలకు వీలునిచ్చే ఆస్తి హక్కుల్ని ఇస్తుంది. కొందరు పౌరులు, జీవితాంతమూ అట్టడుగు శారీరక శ్రమలే చేసే వారిగానూ, కొందరు పౌరులు ఎప్పుడూ మేధా శ్రమలే చేసే వారిగానూ వుండే అసమాన శ్రమ విభజనను నిలిపివుంచుతుంది. ఇలాంటి రాజ్యాంగాన్ని రక్షించమని శ్రామిక ప్రజలకు బోధించి ప్రయోజనం లేదు. నామమాత్రమైన హక్కుల్ని కూడా లేకుండా చేసే పార్టీని గెలిపించవద్దంటారు మేధావులు. కానీ, ఉన్న అన్ని పార్టీలూ, అధికారంలో వున్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించేవే.

‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ అంటారు. అసలు ఉన్న ప్రజాస్వామ్యమే కొద్దిమంది అనుభవించే ప్రజాస్వామ్యం అని ఈ మేధావులకి తెలియదా? ఓటు హక్కు ఇచ్చి, ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు అని భ్రమింపజేస్తే ఎలా? జీవితావసరాలూ, వాటి తయారీకి కావలసిన ఉత్పత్తి సాధనాలూ ఒక వర్గానికి రిజర్వ్ అయివుండగా, మిగతా కోట్ల మంది మొహాన ‘రిజర్వేషన్లు’ అనే మెతుకులు విసిరితే, ఆర్థిక రంగంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? దుర్మార్గమైన నిర్బంధ చట్టాల్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వం వద్దంటారు. శతృ వర్గాలున్న సమాజంలో, ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఆ నిర్బంధ చట్టాలు లేకుండా పాలించలేదు. 75 ఏళ్ళ చరిత్రలో ఈ పార్టీలు, ఎన్నో నిర్బంధ చట్టాలను కొత్తగా తయారు చేయడమో, ఉన్నవాటిని మరింత కఠినం చేయడమో చూడవచ్చును.

అన్ని రంగాలలోనూ అసమానతలున్న ఈ సమాజంలో ఎన్నికలు అనేవి, ‘‘పాలకవర్గం లోని ఒక ముఠా చేతుల్లోనించీ ఇంకో ముఠా చేతుల్లోకి బదిలీ చేసే సాధనంగా వుంటున్నది’’ అని ఈ ప్రజానుకూల మేధావులు గుర్తించి, ప్రజలకు చెప్పకపోతే ఎలాగ? ఎప్పుడో 155 ఏళ్ళ కిందటే, మార్క్సు అనే మేధావి గుర్తించిన విషయాన్ని, మనం 75 ఏళ్ళ అనుభవంలో చూడలేదా? (‘‘సార్వత్రిక ఓటింగు ఎటువంటిదిగా వుంటుందంటే, కొన్ని సంవత్సరాలకు ఒక మారు పార్లమెంటరీ వర్గ పాలన కోసం అనుమతిని మంజూరు చెయ్యడానికి మాత్రమే ఉపయోగపడుతూ వుంటుంది.’’ –మార్క్స్.) ఎన్నికలు ‘‘పాలక వర్గాల చేతిలో ఒక ఆటబొమ్మగా దుర్వినియోగం’’ అవుతున్న విషయం, ఎన్నికలు జరుగుతున్న తీరులోనే కనపడుతున్నది గదా? డబ్బూ, కులం, మతం, ఉచితాల పేరుతో పడేసే ముష్టి పధకాలూ ఉపయోగించి పార్టీలు అధికారంలోకి రావడానికే గదా ఈ ఎన్నికలు? ఎన్నికలకూ, పార్టీలకూ, వాటి విధానాలకూ సంబంధించిన నిజాల్ని ప్రజలకు వివరించే రాతలూ, చర్చలూ అవసరం. అంతేగానీ, ఈ పార్టీ గెలిస్తే ఏమి జరుగుతుందీ, ఆ పార్టీ వస్తే ఏమి జరుగుతుందీ అనే రాతలూ, చర్చలూ కాలక్షేపం కబుర్లుగా మిగిలిపోతాయి.

సరైన రాజకీయ జ్ఞానం అందకపోతే, ప్రతీ ఎన్నికలోనూ ఓడిపోయేది ప్రజలే కదా?

ముసలి సతీష్

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఎన్ హెచ్-69 రహదారిపై ఇకపై ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు...

ఎన్‌హెచ్‌ 65పై 17 బ్లాక్‌స్పాట్లు

ప్రమాదాల నివారణకు చర్యలు

అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లకు తక్షణ ఏర్పాట్లు

త్వరలోనే పనులు ప్రారంభం*

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ర్టాలను కలిపే అత్యంత కీలకమైన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65పై 17 ప్రాంతాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు (బ్లాక్‌స్పాట్‌) జరుగుతున్నట్టు గుర్తించారు. ఆయాచోట్ల ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టబోతున్నారు. ఈ హైవేపై సహజంగానే ట్రాఫిక్‌ రద్దీ అధికం. ఈ రహదారిపై గ్రామాలు, మూలమలుపులు, క్రాసింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా 17 ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లు, జంక్షన్‌ ఇంప్రూవ్‌మెంట్లు తదితర చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర పోలీసుశాఖ నమోదుచేసిన వివరాలను జాతీయ రహదారులశాఖ పరిధిలోని ట్రాన్స్‌పోర్ట్‌ రిసెర్చ్‌ వింగ్‌ (టీఆర్‌డబ్ల్యూ) పరిశీలించి బ్లాక్‌స్పాట్‌లను ఖరారు చేస్తుంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకారం, 500 మీటర్లలో వరుసగా మూడేండ్లలో ఐదు రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు, తీవ్ర గాయాలు సంభవించడం, లేక ఒకేసారి జరిగిన ప్రమాదంలో 10 మరణాలు సంభవించడం.. ఈ ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా పరిగణిస్తారు. ఇటువంటి బ్లాక్‌స్పాట్లు హైదరాబాద్‌-విజయవాడ హైవేపై 17 ఉన్నాయి. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలతో కూడిన నివేదికను జాతీయ రహదారులశాఖ రూపొందించింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

17 బ్లాక్‌స్పాట్లలో అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి ప్రతిపాదనలు ఇలా..

ఇరువైపులా లైటింగ్‌తో కూడిన సర్వీసు రోడ్ల నిర్మాణం- కటకమ్మగూడెం, మేళ్లచెరువు, శ్రీరంగాపురం, ఇనుపాముల.

   

రోడ్‌ సైనేజెస్‌తోపాటు స్ట్రీట్‌ లైటింగ్‌తో కూడిన జంక్షన్‌ ఇంప్రూవ్‌మెంట్‌- నవాబ్‌పేట్‌ జంక్షన్‌, ఆకుపాముల, కట్టంగూర్‌, దురాజ్‌పల్లి జంక్షన్‌.

   

అండర్‌పాస్‌(వీయూపీ)లు- రామాపురం క్రాస్‌రోడ్స్‌, కోమరబండ క్రాస్‌రోడ్‌, ముకుందాపురం, పెద్దకాపర్తి, చిట్యాల, చౌటుప్పల్‌, టేకుమట్ల, ఎస్వీకాలేజ్‌, జనగామ జంక్షన్‌.

ఢిల్లీ: మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి తొలి సమావేశం..

ఢిల్లీ: మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి తొలి సమావేశం..

మోడీ నివాసంలో NDA సమావేశం. NDA సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, నితీశ్‌కుమార్‌. ప్రధాని నివాసంలో అమిత్‌ షా, రాజ్‌నాథ్‌, గడ్కరీ. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీఏ సమావేశం. ఎన్డీఏ కూటమికి ఎన్నిక్లలో 292 సీట్లు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కూటమి మధ్య హోరాహోరీ..ఎన్డీఏ కూటమిని ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు..

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కూటమి మధ్య హోరాహోరీ. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి. యూపీ, మహారాష్ట్ర బెంగాల్‌లో తారుమారైన బీజేపీ అంచనాలు. యూపీలో అనూహ్యంగా సమాజ్‌వాదీ పార్టీకి భారీగా సీట్లు. యూపీలో బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించిన సమాజ్‌వాదీ పార్టీ. ఎన్డీఏ కూటమిని ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు.

భారీ మెజారిటీతో విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

పిఠాపురంలో 69169 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఓటమి వైపు స్పీడ్ గా పరిగెడుతున్న ఏపీ మంత్రులు...

ఏపీ: ఓటమి దిశగా 20 మంది మంత్రులు..

వెనకబడ్డ మంత్రులు ధర్మాన, సిదిరి అప్పలరాజు, రాజన్నదొర, బొత్స, అమర్నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి, తానేటి వనిత, జోగి రమేష్, అంబటి రాంబాబు, విడదల రజినీ, ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, రోజా, అంజాద్‌ బాషా, బుగ్గన, ఉషశ్రీ చరణ్‌

ప్రస్తుత ఎలక్షన్ ఫలితాల ప్రకారం జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించనున్న నారా చంద్రబాబు నాయుడు...

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించబోతున్నారు. 

గతంలో అటల్ బీహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా బాధ్యతలను నిర్వర్తించారు.

 ఆ సమయంలో తమకు ఇది కావాలి.. అది కావాలి.. ఏదీ డిమాండ్ చేయలేదు. కేవలం కేంద్రంలో ప్రభుత్వం సజావుగా సాగేలా చూశారు. తాజాగా మరోసారి అదే పాత్రను పోషించబోతున్నారు.

బీజేపీకి ఎదురుగాలులు

తాజాగా విడుదలవుతున్న లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. 

ఈసారి 400 కు పైగా నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నామని, ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారంటూ బీజేపీ ఊదరగొట్టింది. 

తీరా ఫలితాలు వస్తున్న తీరును గమనిస్తుంటే ఎన్డీయే కు వస్తున్న ఫలితాలు అంతంతమాత్రంగానే కనపడుతున్నాయి. 

ఇండియా కూటమి అనుకున్నదానికన్నా అద్భుతమైన పనితీరును కనపరుస్తోంది. మంచి ఫలితాలను రాబడుతోంది.

మిత్రపక్షాలపై ఆధారపడాలి

 భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేైసినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనపడటంలేదు.

 మిత్రులపై తప్పనిసరిగా ఆధారాపడాల్సిన పరిస్థితి కనపడుతోంది. 

దాదాపుగా మిత్రపక్షాలమీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవుతోంది.

 ఎన్డీయే కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీది కీలక పాత్ర అవుతోంది. 

రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుండటంతోపాటు భారీ స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకోబోతోంది.

 దాదాపు పోటీచేసిన అన్ని ఎంపీ స్థానాల్లోను గెలవబోతోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పనుండటం ఖాయమైందని ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో అనుకున్న స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి చంద్రబాబు సూచించిన వారికే కేంద్రమంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి...

ఆంధ్రప్రదేశ్లో సత్తా చూపిస్తున్న జనసేన పార్టీ...

ఈసారి జరిగిన ఎలక్షన్ ఫలితాలలో పోయినసారి కంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో తమ సత్తా చూపిస్తున్న జన సేనానీలు..

ఏపీ అసెంబ్లీ ఫలితాలు: పోటీ చేసిన 21 సీట్లలో జనసేన ఆధిక్యం

తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన Hawk Eye యాప్‌ హ్యాక్‌...

తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన Hawk Eye యాప్‌ హ్యాక్‌. దాదాపు 2 లక్షల మంది మహిళల పేర్లు, కంప్లైంట్స్‌, ఫోన్‌ నెంబర్స్‌. లొకేషన్స్‌, SOS జర్నీ వివరాలు లీక్‌ అయినట్లు సమాచారం.

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్..

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

సీసీబీ పోలీసుల మూడో నోటీసుకు హాజరైన హేమ

పోలీసు విచారణకు బుర్ఖాలో వెళ్లిన హేమ

విచారణ అనంతరం హేమను అరెస్ట్ చేసిన పోలీసులు.

ప్రభుత్వాస్పత్రిలో నటి హేమకు వైద్య పరీక్షలు

రేపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్న పోలీసులు

రేవ్‌ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర

ఐదుగురితో కలిసి రేవ్ పార్టీ నిర్వహించిన హేమ