ఉన్న సొసైటీకి ఎన్నికలు పెట్టండి మొర్రో.. అంటే కొత్త సొసైటీని ఏర్పాటు చేస్తాం అంటున్న మత్స్యశాఖ అధికారికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ...
ఉన్న సొసైటీకి ఎన్నికలు పెట్టండి మొర్రో.. అంటే కొత్త సొసైటీని ఏర్పాటు చేస్తాం అంటున్న మత్స్యశాఖ అధికారి
తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం టీ ఆర్ ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ కార్యాలయంలో మత్స్యశాఖ అధికారిని కలిసి అభ్యంతరం తెలియచేస్తు లేఖను అందచేసారు, ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..
నల్లగొండ జిల్లాలో పురాతనమైనటువంటి రాష్త్రంలోని అతి పెద్దదైన నల్లగొండ జిల్లా మత్స్య సొసైటీకి గత కొన్ని ఏండ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యంతో అశ్రద్ధ చేసి అదే విదంగా గ్రామ మత్స్య సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా పెండింగ్ పెట్టి ఇవ్వాలా ఆదరాబాదరాగా నూతన జిల్లా సొసైటీని ఏర్పాటు చేస్తామంటూ చీఫ్ ప్రమోటర్ నూ జనరల్ బాడిని ప్రకటిస్తామని ఈనెల 7వ తారీఖున సమావేశం ఉంటుందని చెప్పడాన్ని వారి అవగాహనారాహిత్యాన్ని తెలియచేస్తుందంటూ నూతనంగా ఏర్పాటు అయిన కొత్త జిల్లాల్లో మాత్రమె నూతన జిల్లా సొసైటీని ఏర్పాటు చేసి అట్టి సొసైటీకి మాత్రమె చీప్ ప్రమోటర్ ని జనరల్ బాడిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందనీ..
ఆ మేరకు జిల్లా నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆ ప్రాతిపాదికనే నూతన జిల్లా మత్స్య సొసైటీలు ఏర్పటైనాయని గతంలో ఉన్న నల్లగొండ జిల్లా మత్స్య సొసైటీకి రాజ్యాంగ బద్దంగా రహస్య ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ పెట్టాలంటూ నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వం తరపున మత్స్యశాఖ ఏర్పాటు చేసిన 249 మత్స్య సొసైటీలలో ఎన్నికలు జరగకుండా ఉన్న అతి పెద్ద ప్రాజెక్ట్ లైన మూసి రిజర్వాయర్, ఏ కే బీ ఆర్ ప్రాజెక్ట్ లతో పాటు పెండింగ్ లో ఉన్న వందకు పైగా మత్స్య సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి అట్టి పాలకమండల్లు ఏర్పాటై ఆ సొసైటీలు కూడా తమ న్యాయమైన ఓటు హక్కును వినియోగించుకునెలా చేసిన తరువాతే జిల్లా మత్స్య సొసైటీ ఎలక్షన్స్ కి జిల్లా మత్స్యశాఖ వెళ్ళాలని డిమాండు చేశారు,
ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు జిట్టబోయిన రమేష్, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుడిసె కృష్ణ, రాఖి తదితరులు పాల్గొన్నారు.
Jun 01 2024, 16:30