భద్రాచలం: మారుతి కాలేజీలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మరణంపై కలెక్టర్, ఎస్పీ న్యాయ విచారణ జరిపించాలి:PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్
భద్రాచలం మారుతి కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయినా పగిడిపల్లి కారుణ్య మరణం పై కలెక్టర్,SP, న్యాయ విచారణ జరిపించాలి PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ మస్తాన్ అధికారులను డిమాండ్ చేశారు
కొనిజర్ల మండలం ఓ గ్రామం నుండి వచ్చి డాక్టర్ కాంతారావు నడుపుతున్న మారుతి పారామెడికల్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న పగిడిపల్లి కారుణ్య ఎలా చనిపోయిందో కలెక్టర్ ఎస్పీ న్యాయ విచారణ జరిపించాలనీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ మస్తాన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతి కాలేజీ సిసి కెమెరా ఫుటేజ్ డిలీట్ చేయటం రాష్ట్రవ్యాప్తంగా అనుమానాస్పదంగా మారిందని ఆయన అన్నారు 12, వ తారీకు గురువారం రాత్రి 8,గంటలకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయినట్టు నిర్ణయించారు శుక్రవారం మధ్యాహ్నం 3, గంటలకు 25 లక్షలకు కాలేజీ యాజమాన్యం డాక్టర్ కాంతారావు సెటిల్మెంట్ చేశారు దీనిపై హైకోర్టు విచారణ జరిపించాలని మహిళా సంఘాలు గిరిజన సంఘాలు న్యాయ విచారణ జరిగే వరకు ఉద్యమాలు చేపట్టాలని కామ్రేడ్ మస్తాన్ పిలుపునిచ్చారు మారుతి కాలేజీకి మారుతి కాలేజీ యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ ఎస్పీ విచారణ జరిపించి తగు న్యాయం జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు అయితే మా డిమాండు కారుణ్య క్రింద పడిన స్థలంని మిత్ర బృందాన్ని స్థలాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి సరైన ఎంక్వయిరీ చేయాలని కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా తప్పు ఎవరైనా ఎంతటి వారైనా చట్టం ముందు అందరూ సమానమే వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని నియమా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భద్రాచలం మారుతి పారామెడికల్ కాలేజీపై ఇండియన్ నర్సింగ్ కౌన్సిలర్ కు కంప్లీట్ చేయాలని అమ్మాయి తల్లిదండ్రులు చిన్నతనంలోనే కొట్టుకొని విడాకులు తీసుకొని ఉన్నారు కారుణ్య బాధ్యత మొత్తం వాళ్ళ మేనమామే తీసుకున్నారు ఆ అమ్మాయిని మేనమామ కష్టపడి చదివించాడని అన్నారు కారుణ్య చనిపోయిన ప్లేస్ కు వెళ్లి విచారణ జరపకుండా ఇది కేవలం ఆత్మహత్య అని హట్టు కథలు అల్లి 25 లక్షలకు వాళ్ళ తల్లిదండ్రులకు సెటిల్మెంట్ చేసి కాలేజ్ యాజమాన్యం చేతులు దులుపుకోవాలని చెప్పి చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థి మహిళా సంఘాలుసంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
May 31 2024, 13:34