నక్సల్ బరి పోరాటానికి 57 ఏళ్ళు
భారతదేశ పీడిత ప్రజలకు విప్లవ పోరాట మార్గాన్ని చూపిన నక్సల్ బరి పోరాటానికి 57 ఏళ్ళు నిండిన సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ పై ఎర్రజెండా ను ఎగరవేశారు.
ఈ సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ పాల్గొని మాట్లాడుతూ.. 1967లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లాలో సిలుగురి ప్రాంతంలో సంతాల్ రైతులు తమకు భూమి కావాలని పోరాటాన్ని కొనసాగిస్తే నాడు ఉన్న సంకీర్ణ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఆ పోరాటంపై కాల్పులు జరిపి 11 మందిని బలిగొన్నదని అన్నారు. ఆ పోరాటమే ఈ దేశ విముక్తి కి విప్లవ పంథాను చూపిందన్నారు. భూమి, బుక్తి కోసం సాగిన నక్సల్ బరి పోరాటం అందించిన స్ఫూర్తితో దేశంలో హింస, అణిచివేత, పీడనలకు వ్యతిరేకంగా విప్లవ పోరాటాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆ ప్రేరణతో అనేకమంది యువకులు, విద్యార్థులు, మేధావులు విప్లవ పోరాటలలోకి వచ్చారని, శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటం కూడా కొనసాగిందని అన్నారు. నాడు జరిగిన నక్సల్ బరి పోరాటం పార్లమెంటరీ పందాకు, విప్లవ పందాకు మధ్య విభజన రేఖను గీసిందని, ఆ రైతాంగ ఉద్యమంపై జ్యోతిబసు ప్రభుత్వం చేసిన దుర్మార్గమే సిపిఎం లోని అగ్ర శ్రేణి కార్యకర్తలు, నాయకులు విప్లవ మార్గంలో ప్రయాణించారని అన్నారు. నక్సల్ బరి పోరాట స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, PYL జిల్లా కార్యదర్శి బివి చారి, రావుల వీరేశ్, జానపాటి శంకర్, దాసరి నర్సింహా, అయోధ్య,బాలాజీ, పవన్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
May 26 2024, 21:25