జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ !
- 19 నుంచి రెండో దశ కౌన్సెలింగ్
- 3 దశల్లో కౌన్సెలింగ్.. షెడ్యూల్ విడుదల
- జూలై 12న మొదటి దశ సీట్ల కేటాయింపు
- జూలై 19 నుంచి రెండో దశ కౌన్సెలింగ్
- మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహణ
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వెల్లడైంది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన అడ్మిషన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
జూన్ 27వ తేదీ నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్ 27 నుంచి జూలై 5 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ చేసుకుని కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
జూన్ 29 నుంచి జూలై 6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూన్ 30 నుంచి జూలై 8 వరకు సీట్లకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 12న మొదటి దశ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 12 నుంచి 16 వరకు ఫీజు చెల్లించడంతోపాటు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
జూలై 19 నుంచి రెండో దశ కౌన్సెలింగ్ మొదలుకానుంది. ఈ దశలో జూలై 24న సీట్లను కేటాయించనున్నారు. జూలై 30 నుంచి తుది దశ కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఈ దశలో ఆగస్టు 5న సీట్లను కేటాయిస్తారు. ఆ తర్వాత కూడా భర్తీ కాకుండా సీట్లు మిగిలితే వాటి భర్తీ కోసం ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
May 25 2024, 11:21