రాజకీయ పార్టీ అభ్యర్థులనే కాకుండా స్వతంత్ర అభ్యర్థులవైపు కూడా చూడండి...
•పాలకూరి రవి గౌడ్, నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి
ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో రాజకీయ పార్టీల అభ్యర్థులనే కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని గెలిపించడానికి మేధావులైన పట్టభద్రులను కృషి చేయాలని, అదే విధంగా తమ అమూల్యమైన ఓటును స్వతంత్ర అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతగా వేసి గెలిపించుకోవాలని నల్లగొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి గౌడ్ కోరారు..
నిరుద్యోగుల సమస్యల నుండి పుట్టుకొచ్చిన స్వతంత్ర అభ్యర్థులను గెలుపించుకుంటే పెద్దల సభలో తమ సమస్యల గురించి పొరడగలుగుతారు అని అన్నారు..
గతంలో ఆయా పార్టీల అభ్యర్థులను గేలిపించుకుంటే ఆ పార్టీకి ఒక సంఖ్య పరంగా బలం పెరిగింది తప్పా నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు..
కొన్ని రాజకీయ పార్టీల నుండి బరిలో వున్నా అభ్యర్థులు ఆ పార్టీ నుండి వచ్చే పార్టీ ఫండ్ నొక్కేయడానికే పోటీలో ఉన్నారు అని.. అలాంటి వ్యక్తులకు మీ అమూల్యమైన ఓటు వేసిన హృదయ అవుతుంది అని అన్నారు..
కాబట్టి మీరు చదువుకున్న ఓటర్లు కాబట్టి మీకున్న సమస్యలను పరిష్కారమ్ చేయగలుగుతాడు అనే నమ్మకం వున్న అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకోవాలని నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్ధి పాలకూరి రవి గౌడ్ కోరారు...
May 24 2024, 17:52