AP Election:పిన్నెల్లి విధ్వంసం సీఈఓ పై ఎన్నికల సంఘం సీరియస్.. సాయంత్రం 5 గంటల లోపు..!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది..
ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఈ ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాకు ఎన్నికల కమిషన్ తాఖీదు పంపింది. పాల్వాయి గేట్‌లో ఈవీఎం ధ్వంసం సంఘటనపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం అడిగింది.
అసలేం జరుగుతోంది..?
సీసీ ఫుటేజీలో ఉన్నది.. ఘటనలో పాల్గొన్నది ఎమ్మెల్యేనా.. కాదా..? అని సీఈసీ ప్రశ్నించింది. ఎమ్మెల్యే పిన్నెల్లి అయితే కేసు ఎందుకు పెట్టలేదు..? అని సీఈవోపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నల వర్షం కురిపించింది. కేసు పెడితే ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా..? లేదా.. నిందితుడిగా చేర్చి ఏంటే అరెస్ట్ చేశారా..? లేదా అని ముఖేష్ కుమార్‌ను సీఈసీ నిలదీసింది. ఇప్పటి వరకూ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని క్లియర్ కట్‌గా సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటలలోపు ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ముకేశ్‌కుమార్ మీనాను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. పిన్నెల్లి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లుగా తెలియవచ్చింది. దీంతో ఏం జరుగుతుందో ఏమో అని ఇటు పిన్నెల్లి బ్రదర్స్.. అటు వైసీపీలో టెన్షన్ నెలకొం
పోలింగ్ రోజు జరిగింది ఇదీ..?
రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా.. అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని.. తనకు ఓట్లు వేయడం లేదన్న అక్కసుతో పిన్నెల్లి బరితెగించారు. గ్రామంలోని 202వ నంబర్ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి.. ఈవీఎంను ఎత్తి నేలకేసికొట్టారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంటుపై ఆయన, ఆయన అనుచరులు దాడిచేశారు. అలాగే మరో ఏడు పోలింగ్ కేంద్రాల్లోనూ పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ ఏజెంట్‌పై అదేరోజు బూత్ బయటే గొడ్డలితో దాడి చేశారు..
May 22 2024, 13:32