ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి ,జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఐకెపి, సొసైటీ కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం స్థానిక శాసనసభ్యులు తగిన విధంగా స్పందించి వడ్లును కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా బాధ్యత తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేసినారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో భువనగిరి మండలం ఐకెపి (వడ్ల కొనుగోలు కేంద్రం) ని సందర్శించిన అనంతరం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతూ భువనగిరి మండల తహిశీల్దార్ అంజిరెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ఆరు కాలము కష్టపడి కరువులో బోరుబావులు అడగండి సగం చేండ్లు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు ఎల్లక అనేక అవస్థలతో ఉన్న కాస్త పండిన పంటను కోసి ధాన్యాన్ని మార్కెట్ కు తెచ్చి 60 రోజులు గడుస్తున్న సరిగా కొనుగోలు చేయక వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునే నాధుడే కరువయ్యాడని నర్సింహ ఆవేదన వెలిబుచ్చారు. గత పాలకులు రైతులను ఇబ్బంది పెడితే నేను అన్ని విధాలుగా ఆదుకుంటానని అనేక మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని సరిగా కొనటం లేదని ప్రశ్నించారు. రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే జిల్లా కలెక్టర్ యంత్రాంగం, ఓట్లు వేసుకుని గద్దెనెక్కిన శాసనసభ్యులు ఎందుకు మార్కెట్లను సందర్శించి రైతుల బాధలను తీర్చడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని మార్కెట్ కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లారీల కొరతను, గన్ని బ్యాగుల కొరతను వెంటనే నివారించాలని, తరుగు పేరుతో క్వింటాకు 5 కిలోల చొప్పున మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న దానిని అరికట్టాలని, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు రైతుల బాధలు పట్టించుకోని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని నర్సింహ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య , అన్నంపట్ల కృష్ణ , కొండా అశోక్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గునుగుంట్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బొల్లెపల్లి కుమార్, మండల కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్ , కొండాపురం యాదగిరి, అనాజపురం శాఖ కార్యదర్శి ఎదునూరి వెంకటేష్, నాయకులు గంగనబోయిన బాల నరసింహ, బొల్లెపల్లి స్వామి, బొల్లెపల్లి కిషన్, కడారి కృష్ణ , పిట్టల శ్రీశైలం, కడ మంచి రవి, అంజయ్య , రైతులు శ్రీరామ్ శ్రీశైలం , పున్నమ్మ, యాదయ్య, పోషయ్య తదితరులు పాల్గొన్నారు.
May 17 2024, 17:07