మూసి పరివాహక ప్రాంతంలో ఏ గ్రేడ్ కిందనే ధాన్యం కొనుగోలు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్
రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు గోస పడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టదా!! ప్రజల ఓట్లు వేయించుకోవడమే కాదు!! రైతుల గోస కూడా పట్టించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రోజున వలిగొండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం బృందం పరిశీలించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా మార్కెట్లలో రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు రైతుల గోస ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టదా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో రైతులను ప్రభుత్వం తీవ్రమైన మోసం చేస్తుందన్నారు రైతులు పండించిన పంటకు 'ఏ గ్రేడ్' ఇవ్వకుండా 'బి గ్రేడ్' కింద కొనుగోలు చేయడం రైతాంగానికి తీవ్రమైన అన్యాయమన్నారు వెంటనే బి గ్రేడ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఒకవైపు ప్రభుత్వం, వాతావరణ శాఖ వర్షాలు రాబోతున్నాయని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఇంకా అనేక గ్రామాల్లో దాన్యం కుప్పలు, కుప్పలుగా కొనుగోలు జరపకుండా మిగిలిపోయిందన్నారు అకాల వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కొనుగోళ్లు వేగవంతం చేయాలని లారీల కొరతను,గన్ని బ్యాగుల కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల మధ్య సరైన సయోధ్య లేకపోవడంతో ఇద్దరి మద్య రైతులు నష్టపోతున్నారన్నారు తరుగు పేరుతో క్వింటాల్ కు 5 కిలోల చొప్పున మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ప్రభుత్వానికి తెలియదా?? అని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వెంటనే ఏలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతు సమస్యలపై పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కల్కూరి రామచంద్రర్, మెరుగు వెంకటేశం, వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ మండల కమిటీ సభ్యులు ఏలే కృష్ణ, కలుకూరి ముత్యాలు, కందడి సత్తిరెడ్డి,SFI జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు,సిపిఎం మండల నాయకులు వేముల నాగరాజు,కొమ్ము స్వామి,దయ్యాల సత్యరాములు, కందగట్ల సాయిరెడ్డి,వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
May 16 2024, 15:09