భువనగిరి: పోలింగ్ బూత్ 65 ,91 లలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు, ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ పంగరెక్క స్వామి ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ
దేశ వ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ భువనగిరి నియోజకవర్గం పట్టణ పరిధిలోని 65 , 91 బూత్ నెంబర్లలో పట్టణ 8 వ వార్డు కౌన్సిలర్ పంగరెక్క స్వామి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు మరియు మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పోలింగ్ కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూత్ ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు భారీగా భద్రతను మోహరించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్థానిక 8వ వార్డు జంఖాన్నగూడెం , రామ్ నగర్ , సీతానగర్ లలో ఓటర్లు కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉచిత మందులను ఓఆర్ఎస్ ప్యాకెట్లను , మంచినీటి సదుపాయాన్ని పోలింగ్ బూత్ ల వద్ద ఏర్పాటు చేశారు. ఓటర్లు క్యూ పద్ధతిలో నిలబడి నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఓటర్లకు , పోలింగ్ సిబ్బందికి , పోలీసులకు , మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంగరెక్క స్వామి , కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయన సబిత గోపాల్ , డాక్టర్లు సాయి పవన్ , ఎ యన్ యం టి. ప్రేమలత , ఇంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.
May 15 2024, 14:46