ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : AITUC
కార్మిక హక్కులు మరియు చట్టాల పరిరక్షణకై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని భువనగిరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మరియు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. శనివారం రోజున ఇండియ కూటమి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికుల అడ్డాల వద్ద తిరిగి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించిన ఏఐటీయూసీ కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ, కేసీఆర్ ఒక్కేటనని అన్నారు, పొరపాటున BRSకి ఓటు వేసిన అది,BJP కే వెళ్తుందని అన్నారు, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సాగిస్తున్న ఎన్నికల ప్రచారం బాహాటంగానే మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతోందని, ఈ నేపథ్యంలోనే బీజేపీ నిసిగ్గుగా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం సిగ్గు చేటు అన్నారు. ఓట్లను సంపాదించడం కోసం కుల, మత భావాలను రెచ్చగొట్టరాదన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని అన్నారు. 13 సోమవారం రోజున జరిగే ఎన్నికలలో కార్మికులందరూ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ లో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కసబ శ్రీనివాస్ రావు, పిట్టల బాలరాజ్, ఏఐటీయూసీ నాయకులు గనబోయిన వెంకటేష్, సామల భాస్కర్, ముదిగొండ బసవయ్య, వల్దాస్ నరసింహ, ఐలయ్య, మల్లేష్, గణేష్, పరశురాములు, కృష్ణా, జగన్, తదితరులు పాల్గొన్నారు.
May 13 2024, 17:51