మాజి మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు కిలక వాఖ్యలు !
మాజి మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు కిలక వాఖ్యలు !
- సీఎం రేవంత్‍రెడ్డి నా శిష్యుడే..
- బజార్లో ఉన్న వ్యక్తిని ఎంపీ చేశారు: ఎర్రబెల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శిశ్యుడే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మూడుసార్లు మాత్రమే గెలిచిన రేవంత్ సీఎం అయ్యాడని.. ఏడు సార్లు గెలిచిన తాను ఇలా మిగిలానని చెప్పుకొచ్చారు. పార్టీ మారిన ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైనా ఎర్రబెల్లి ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఎవరిచ్చారనేదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో ఆయన టీడీపీ పార్టీలో పని చేయగా.. చంద్రబాబే ఆయనకు రాజకీయ గురువు అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇదే ప్రశ్నను ఇటీవల ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో జర్నలిస్టులు సంధించారు. దానికి సమాధానం చెప్పిన రేవంత్ రెడ్డి తనకు రాజకీయ గురువు అంటూ ఎవరూ లేరని చెప్పారు. తాను చంద్రబాబు శిశ్యుడిని అంటే ము* తంతా అంటూ కాస్త పరుషంగానే రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు తనకు గురవు కాదని.. ఇద్దరం ఒకే పార్టీలో పని చేశామని రాజకీయ సహచరుడు మాత్రమే అని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో కలిసి గతంలో టీడీపీలో పని చేసి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక కామెంట్స్ చేశారు. శిశ్యరికంపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేసి వారం గడవకముందే.. ఎర్రబెల్లి అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎవరో కాదని.. తన శిశ్యుడే అని చెప్పుకొచ్చారు. వర్ధన్నపేటలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన రేవంత్ తన శిశ్యుడే అని కామెంట్లు చేశారు. అంతే కాదు రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి మోసాలు చేస్తడని.. అబద్ధాలు, జిమ్మిక్కులు చేస్తడని విమర్శించారు. మూడుసార్లు గెలిచినోడు సీఎం అయ్యారని.. ఏడుసార్లు గెలిచినోన్ని ఇక్కడ మీ ముందున్నానని చెప్పారు. అబద్ధాలాడేటోడే ముందుకుపోతున్నడని.. న్యాయమనేది లేదని నిట్టూర్చారు. అయినా రేవంత్ ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగరని... తక్కువ టైంలోనే కాంగ్రెస్ పార్టీపై జనాల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిలోనే కూలిపోతుందని సంచలన కామెంట్స్ చేశారు.
ఇక వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బజార్‌లో ఉన్న దయాకర్‍ను తీసుకొచ్చి.. రూపాయి లేకున్నా ఎంపీ చేసిన మహనుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. అట్లాంటి పసునూరి కూడా పార్టీ మారాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రీహరిని తన తండ్రే చదివించాడని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అవకాశాలను తీసుకుని బీఆర్ఎస్ పార్టీకి నమ్మకద్రోహం చేసిన చరిత్ర కడియం శ్రీహరిది అని ఎర్రబెల్లి మండిపడ్డారు.
May 13 2024, 16:49