అకాల వర్షం వల్ల నష్టపోయిన వరి ,మామిడి రైతులను ఆదుకోవాలి, మామిడి , వరి రైతులకు నష్టపరిహారం అందించాలి: దయ్యాల నరసింహ సిపిఎం మండల కార్యదర్శి
యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు తీవ్రంగా నష్టపోయిన రైతులను, మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఐకెపి కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే కదలాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహ డిమాండ్ చేశారు.* *బుధవారం రోజున సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గారి గెలుపును కోరుతూ హన్మాపురం, వడపర్తి, పెంచికల్పహాడ్ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఐకెపి కేంద్రాల్లో ,ఉపాధి హామీ కేంద్రాల్లో సందర్శించి ప్రచారం నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఆరుగాలం కష్టం చేసి పండించిన వరి ధాన్యాన్ని ఐకేప్ కేంద్రాల్లో పోసి ఉన్న దాన్యం పూర్తిగా తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని అదేవిధంగా రాలిపోయిన మామిడి కాయలను, పడిపోయిన మామిడి చెట్లను పరిశీలించి మామిడి రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి మామిడికాయలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల మామిడి చెట్లు మామిడికాయలు నేలరాలిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 10 లక్షల పైన పెట్టుబడి పెట్టి నష్టపోయారని అన్నారు. బలమైన ఈదుర గాలుల వల్ల అనేక చెట్లు నేలమట్టం అయ్యాయని చెప్పారు . తక్షణమే మావిడి తోట రైతులను ఆదుకోవడం కోసం ఎకరాకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వ యంత్రాంగం జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి పంట నష్టపరిహారాన్ని అందించడానికి పర్యటన చేయాలని డిమాండ్ చేశారు.* *గ్రామాలలో ఇండ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోవడం ,పాత ఇండ్లు పోవడం వలన ఆస్తి నష్టం ఇంట్లో దాచుకున్న బియ్యం తడిసి నష్టం జరిగిందని అన్నారు అనేక చోట్ల చెట్లు కూలి కరెంటు లైన్ స్తంభాలు పడిపోయాయని , ఇండ్ల పైకప్పులు లేచిపోయి ఇంటిలో ఉన్న వంట సామాగ్రి బియ్యం బట్టలు పూర్తిగా తడిసి ముద్ద అయ్యయని అన్నారు. ఈదురుగాలుల వల్ల కరెంటు స్తంభాలు కూలి రాత్రంతా కరెంటు లేక బిక్కుబిక్కుమంటూ మేల్కొని ఉన్నారన్నారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల్లో పోసి ఉన్న ధాన్యం పూర్తిగా తడిచాయని తడిచిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించిధన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ వ్యవసాయ అధికారులు కలిసి కలిసి నష్టపోయిన వరి ధాన్యం రాలిపోయిన మామిడి పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.* *ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, మాజీ ఎంపిటిసి దయ్యాల లక్ష్మి, పాండల మైసయ్య, మోటే ఎల్లయ్య, వడ్డెబోయిన వెంకటేష్ ,కొండాపురం యాదగిరి ,బండి శ్రీను, కళ్లెం లక్ష్మీ నరసయ్య ,దయ్యాల మల్లేశం, పాండాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
May 09 2024, 16:38