నాంపల్లి మండలం స్థాయి బూత్ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం
నాంపల్లి: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైంది. ప్రజలందరి దీవెనలతో ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది. ఇప్పుడు ఆదర్శ తెలంగాణను తీర్చిదిద్దుకుందామని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.నియంతృత్వ బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయడమే తన లక్ష్యమన్నారు.
సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో మండలం స్థాయి బూత్ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు అభివృద్ధిని చేయలేరన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు, త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని బీజేపీ, బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలను నమ్మవద్దని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని తనను ఆదరించినట్లే అతనిని కూడా ఆదరించాలని అన్నారు. నాంపల్లి మండలం నుండి భారీ మెజార్టీని తేవాలని అన్నారు.
నక్కలగండి పూర్తి చేసి కిష్ణరాంపల్లి, చర్లగూడెం, ప్రాజెక్టుల ద్వారా సాగు, త్రాగునీరు, మునుగోడు నియోజకవర్గ ప్రజలు అందించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. గత పది ఏళ్లలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో దేశ చరిత్రలోనే గుర్తింపు ఉండేలాగా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కార్యకర్తలను కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలిచి తీరుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, ప్రతి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. రైతుబంధు రాని వారికి ఈనెల 9 నుండి రైతుబంధు, అందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యనిర్వణ కార్యదర్శి పున్న కైలాస్, నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, మేకల రమేష్ ముదిరాజ్, పానుగంటి వెంకన్న, విష్ణువర్ధన్ రెడ్డి, కొమ్ము బిక్షం, అంగిరేకుల పాండు, సుధనబోయిన శ్రీను యాదవ్, దండిగ అలివేలు నరసింహ, కోరే యాదయ్య, పోగుల దివ్య, అబ్బనబోయిన చంద్రమౌళి, బొల్లంపల్లి విష్ణుమూర్తి, మెగావత్ రవి నాయక్, మెగావత్ దీప్లా నాయక్, అన్నేపాక కిరణ్, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి, దామర యాదగిరి, దొటి పరమేష్ యాదవ్, రేవల్లి సుధాకర్, గుండాల అంజయ్య, ఈద శేఖర్, మారేపాకుల కొండలు, దూదిమెట్ల యాదగిరి, సురేందర్ నాయక్ పానుగంటి వెంకటయ్య, గాదేపాక నాగరాజు, వడ్డేపల్లి సైదులు, కలకొండ దుర్గయ్య, జమ్లా నాయక్, కామిశెట్టి చత్రపతి, తదితరులు పాల్గొన్నారు.
May 09 2024, 15:20