భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు
నిరంతరం ప్రజల తరఫున, కూలీల, రైతుల తరుపున నిలబడుతూ సమస్యల పరిష్కారానికై , వారి హక్కుల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ ని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామంలో పనిచెస్తున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని దగ్గరికి వెల్లి కూలీల దగ్గర ప్రచారం నిర్వహించడం ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె చట్టం వచ్చిందని అన్నారు. నేడు బిజెపి 10 సంవత్సరాల పాలనలో ఉపాధి హామీ పథకంకు ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు బిజెపి ప్రభుత్వం చేస్తున్నది వారు విమర్శించారు. కొన్ని జిల్లాలకి పని చూపాలని, కూలీల సంఖ్యను తగ్గించాలని, పని దినాలు వేతనాలు తగ్గించాలని ప్రయత్నం చేస్తుందని అన్నారు. చట్టంలో ఉన్న మౌలిక సమస్యలు కూడా అమలు చేయడం లేదని ఆవేదన వెలుబుచ్చారు. కొత్త కొత్త జీవోలు తెచ్చి కూలీలను అయోమయంలో నెడుతున్నారని సరిగా బిల్లులు విడుదల చేయకపోవడం, రెండుసార్ల ఫోటో తీసే విధానం, బ్యాంకుకు ఆధార్ లింకు ఇలాంటివి కూలీల పోట్టగొట్టే విధంగా బిజెపి తీసుకొస్తున్న విధానాలు ఉన్నాయని అన్నారు. కూలీలంతా బిజెపిని ఓడించకపోతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉండదని అందుకే పోరాడే సిపిఎంను గెలిపించాలని నరసింహ కూలీలను కోరినారు. మరో పక్క బీజేపీ అధికారంలో వచ్చినాకనే ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతున్నారని ఇలాంటి బీజేపీని మళ్లీ అధికారంలో రాకుండా ప్రజలందరూ చూడాలని కోరినారు. నిరంతరం కూలీల కోసం రైతుల కోసం పేదల కోసం ఈ ప్రాంతం తాగు తాగునీరు విద్యా వైద్యం అభివృద్ధి కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని నర్సింహ ప్రజలను కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, గ్రామ కమిటీ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, నాయకులు ఎండి. జహంగీర్, బొల్లెపల్లి కిషన్, పాండు, నర్సింహ, బొల్లెపల్లి పరమేష్, కళ్లెం లక్ష్మీ, నరసయ్య, మైలారం శివ, తోటకూరి మల్లేష్ ,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు గంటెపాక శివ తదితరులు పాల్గొన్నారు.
May 08 2024, 17:07