ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు చెల్లింపు వార్తల పట్ల నిశితంగా పరిశీలించాలి: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు కే జండగె
ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు, (పెయిడ్ న్యూస్) చెల్లింపు వార్తల పట్ల నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. సోమవారం నాడు కాన్ఫరెన్స్ హలులో ఆయన సభ్యులతో సమావేశమైనారు. ఎన్నికల ప్రవర్తనా నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను పరిశీలించాలని, ఓటరుపై ప్రభావితం చేసే వార్తల పట్ల అప్రమతంగా ఉండాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్, లోకల్ కేబుల్ ఛానల్స్, సోషల్ మీడియా, వాట్సప్, ఈ పేపర్లలో రాజకీయ ప్రకటనలు మానిటరింగ్ చేయాలని, అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేస్తే రిటర్నింగ్ అధికారికి తెలిపి నోటీస్ జారీ చేయాలని అన్నారు. ప్రచారం కొరకు అవసరమయ్యే అనుమతులను పరిశీలించి జారీ చేయాలని, వివిధ వార్తాపత్రికలు, టెలివిజన్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే వాటికి అయ్యే ఖర్చులు ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ కు పంపాలని, సంబంధిత నివేదికలను ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. సమావేశంలో మెంబర్ సెక్రెటరీ, జిల్లా సంబంధాల అధికారి పి. వెంకటేశ్వర రావు, సోషల్ మీడియా నోడల్ అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి, కమిటీ సభ్యులు జి.దయాకర్, కె.శ్రీనివాస్, ఎ.శ్రవణ్, పాల్గొన్నారు.
May 07 2024, 16:34