NLG: రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని బిఆర్ఎస్ ను పూర్తిగా బొంద పెట్టేంత వరకు నిద్రపోనని అన్నారు.
శనివారం నాంపల్లి మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మండల కేంద్రంలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం సభ వేదిక నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడని బిడ్డే లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి తీహార్ జైల్లో ఉందని, ఫోన్ టాపింగ్ అంశంపై మరో కేసు నడుస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో సిగ్గు లేకుండా కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని జనాల్లో తిరుగుతున్నాడో చెప్పాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
బూర నర్సయ్య గౌడు పాత బిఆర్ఎస్ పార్టీ బుద్ధులు కొత్త బిజెపి పార్టీలో చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ డాక్టర్ జేఏసీ తరఫున బూర నర్సయ్య గౌడ్ ను తీసుకురాకపోతే నేడు ఆయన ఎవరికి తెలుసు అని ప్రశ్నించారు.
కేసీఆర్ కు గతంలో అత్యంత సన్నితుడైన బుర్ర నర్సయ్య గౌడ్ భువనగిరికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎయిమ్స్ వచ్చిందని, 5 ఏళ్లు ఎంపీగా ఉండి ఎయిమ్స్ ను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. బిజెపి నాటినుండి నేటి వరకు కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య వైశమ్యాలు సృష్టించి రాజకీయాలు చేస్తుందని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. త్వరలోనే బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ కు అధికారం కట్టబెడతారని ఆశించారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే పాటుపడే పార్టీ అన్నారు.
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని మెజార్టీ ఎంత వస్తుందనే దానిమీదనే ఎదురుచూస్తున్నామన్నారు. అలాగే బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ కు అత్యధిక మెజార్టీ ఇవ్వడంలో మునుగోడు నియోజక వర్గం పోటీ పడనున్నట్లు చెప్పారు. కిష్టరాంపల్లి, చర్లగూడెం, రిజర్వాయర్ పూర్తిచేసి మండల రైతన్నల పొలాల్లోకి కృష్ణా జలాలను అందిస్తామని తెలిపారు. రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.
ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ప్రాజెక్టుల పేరుతో కమిషనర్లను దండుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మధు యాస్కిగౌడ్, పున్న కైలాష్, నాంపల్లి జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, గజ్జల శివారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, పెద్దిరెడ్డి రాజు, చిలుకూరి బిక్షం, బట్టు జగన్ గిరి, అల్లంపల్లి ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
May 06 2024, 21:46