ప్రజా ఉద్యమ నాయకుడు భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని పార్లమెంటుకు పంపండి : కొండమడుగు నరసింహ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు

భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో ఆదివారం సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొని నరసింహ మాట్లాడుతూ సిపిఎం నిరంతరం పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పోరాడుతుందని, నియోజకవర్గం లో నెలకొన్న అనేక సమస్యలపై CPM పోరాటాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహిస్తున్నారు పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గారు ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న సమయంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారంన్యాయమైన పరివారం ఇవ్వాలని ఆందోళనలో ప్రత్యక్షంగా భాగస్వామిగా ఉన్నారు. రిజర్వాయర్లో ముప్పుకు గ్రామాలకు తిమ్మాపురం, లప్పనాయక్ తండ, సోకుల తండా, జంగంపల్లి ,బస్వాపురం రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరివారం చెల్లించాలని, భూమికి భూమి ఇల్లుకు ఇల్లు ఇవ్వాలని అనేక ఆందోళనలో చేసి అధికారుల దృష్టికి ,ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు.
*ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లె అంజయ్య, అన్నప్పట్ల కృష్ణ, కొండ అశోకు, శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, వడ్డెబోయిన వెంకటేష్, మధ్యపురం బాల నరసింహ ,ఉడత విష్ణు, మచ్చ భాస్కర్, ఉడుత వెంకటేష్ ,దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

May 06 2024, 21:23