ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.
భువనగిరి దీప్తి హోటల్ లో జరిగిన పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు
ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందరోజుల లోపే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులను గుర్తించింది అని అన్నారు.
రాబాయే రోజులలో ఆర్యవైశ్యులకు పెద్ద బిడ్డ వేస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులను పట్టించుకోలేదు
కెసిఆర్ నియంత పాలన ప్రజలు తరిమి కొట్టారు అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పాలనను తరిమికొట్టాలి.
మోడీ ప్రధానమంత్రి అనే స్థాయిని మర్చిపోయి గుజరాత్ మోడల్ అని మోడీ గుజరాత్ కి ముఖ్య మంత్రిగా వ్యవహరిస్తున్నాడు
సామాన్య ప్రజల సమస్యలు ఏమిటో నాకు అవగాహన ఉన్నది ఎందుకంటే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మధ్యతరగతి వ్యక్తి కాబట్టి
ఆర్యవైశ్య సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి సంఘానికి రావలసిన పదవులు తీసుకోచ్చే బాధ్యత నేను తీసుకుంటాను
ఈ నెల 13 న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించండి.
ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అమర వాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, సీనియర్ నాయకులు పిసిసి నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, బాల లక్ష్మి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గస్థాయి ఆర్యవైశ్య సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
May 06 2024, 18:32