వలిగొండ మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం
వలిగొండ మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్... జెండా ఆవిష్కరించారు...
దేశ ప్రజల మధ్య విచ్చిన్నకర వైషమ్యాలను సృష్టిస్తూ మరల అధికారంలోకి రావడానికి నీచ కుయుక్తులు పన్నుతున్న బీజేపీ ని త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఓడించాలని...విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఏఐవైఎఫ్ నిరంతరం పోరు సల్పిస్తుందని అఖిల భారత యువజన సమాఖ్య
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో యువకులను
దేశ స్వాతంత్రోద్యమంలో యువకులను సమీకరించి వీరోచితమైన పోరాటం చేసిన ఏకైక యువజన సంఘం AIYF. నేటికీ అనేకమైన ఉద్యమాలు చేస్తూ,విద్య, వైద్య వ్యాపారాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, పని హక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించాలని, సమగ్ర యువజన విధానం కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ను రూపొందించి, అమలు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని ఏ ఐ వై ఎఫ్ పోరాటాలు చేస్తుందన్నారు. సామాజిక, న్యాయం, లౌకిక వాదన పరిరక్షణ, శాస్త్రీయ సోషలిజం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం, అశ్లీల సాహిత్యం, అశ్లీల సినిమాల నిషేధం కోసం, దేశాన్ని చీల్చడానికి కుట్రలు చేనే వచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా, దేశ ఐక్యత, సమైక్యత కోసం AIYF కృషిచేస్తున్నదన్నారు.
అదే విధంగా నేడు దేశ వనరులను యథేచ్ఛగా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశ యువత ఉద్యమించాలని, ఈ ఎన్నికలు అవినీతికి, అభివృద్ధి కి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా యువత పరిగణించాలని వారు అన్నారు. ప్రజల మధ్య విభేదాలు, మత ఛాందస విధానాలకు వ్యతిరేకిస్తూ యువత ఆలోచనలు మారాలని, రాజకీయాలంటే కార్పొరేట్ శక్తుల ధన ప్రభావం కాదని... ప్రజా సేవకు పాటుపడే నేటి యువత అని చాటి చెప్పే విధంగా యువజనులు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ కు ఏఐవైఎఫ్ మండల సమితి సంతాపం
సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ మరణం, దేశంలో వామపక్షాలకు తీరని లోటని. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఫైర్ బ్రాండ్ విద్యార్థి నాయకుల్లో కామ్రేడ్ అతుల్ ఒకరని, ఏ ఐ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం లో జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు.
స్వామినాథన్ కమిషన్ సభ్యుడు కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ ఏకైక రైతు నాయకుడని, స్వామినాథన్ కమిషన్ నివేదికను రూపొందించడంలో ఆయన పాత్ర ఆధునిక భారతీయ వ్యవసాయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమన్నారు. ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారని.కార్యక్రమంలో మారోజు నరసిమాచారి, లింగస్వామి, ఎంగోజు ప్రశాంత్, అంజయ్య,మనీష్ తదితరులు పాల్గొన్నారు
May 04 2024, 17:55