కార్మికుల శ్రమ వలన వచ్చే అదనపు విలువ పంపిణీ జరగాల్సిందే: సిపిఎం
NLG: కార్మికులు తమ రక్తం దారపోసి శ్రమిస్తే వచ్చే అదనపు లాభం ద్వారానే పెట్టుబడుదారులు సంపద పోగేస్తున్నారని, కార్మికులకు అదనపు విలువ పంపిణీ జరగాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మర్రిగూడ మండల కేంద్రంలో మే డే సందర్భంగా సిపిఎం జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని దినం తీసుకురావడం అంటే శ్రామికుల శ్రమను దోపిడి చేయడమేనని, పెట్టుబడుదారుల కొమ్ము కాయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షకుల జీవితాలతో చలగాటమాడుతుందని ఆరోపించారు. ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
మే డే సందర్భంగా మర్రిగూడ మండలంలో ఇందుర్తి, శివన్న గూడెం, మర్రిగూడెం కేంద్రాలలో సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యుల మైలసత్తయ్య, కొట్టంయాదయ్య , పోలే పల్లి రాములు, పగిళ్ల రామచంద్రం లపంగి లింగయ్య, వెంకటయ్య, లక్ష్మణ్,ముత్యాలు, నరేష్, ఐద్వా మండల నాయకురాలు దామెర లక్ష్మి , హేమలత, ఇందిరమ్మ, సిద్ధగొని మహేష్, పిట్టల రమేష్ , సుప్పరి హనుమంతు, శ్రీరాములు, మారగోని సుధీర్, తదితరులు పాల్గొన్నారు.
May 04 2024, 14:46