ప్రజల కోసం పోరాడేది ఎర్రజెండా మాత్రమే సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ కు ఓటేసి గెలిపించండి చెరుపల్లి సీతారాములు సిపిఎం కేంద్ర కమిటీ
భువనగిరి పార్లమెంటులో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు లేదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు అన్నారు
ఈరోజు ఎన్నికల ప్రచారంలో మండల పర్యటనలో భాగంగా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నేడు పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో సిపిఎం అనేక ప్రజా పోరాటాలను నిర్వహించిందని కాంగ్రెస్, బిజెపి,టిఆర్ఎస్ పార్టీలు ప్రజల కోసం ఏం ఉద్యమాలు నిర్వహించారు తెల్పాలని అన్నారు ఎన్నికల్లో డబ్బు మద్యం విపరీతంగా పంచి గెలవాలని ఉద్దేశంతో ముందుకు వస్తున్నారని వారందరినీ ఓడించాలని ప్రజల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని కోరారు ఈ ప్రాంతం నుండి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి సోదరులు ఎంపీలుగా గెలిచిన నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేకపోయారని విమర్శించారు కాంట్రాక్టులు పైరవీలు తప్ప వీటివల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ నాడు ప్రజలకు ఏమి చేయకుండా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేశారని పదవి పోయిన తర్వాత వెంటనే పార్టీ మారి బిజెపిలోకి పోయి మళ్లీ బిజెపి అభ్యర్థిగా ముందుకు వస్తున్నారని ప్రజల కోసం ఏం చేశాడో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అభ్యర్ధి ఎక్కడి నుండి వచ్చారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న జహంగీర్ ఈ ప్రాంతంలో ఉన్న మూసి జల కాలుష్యం అరికట్టాలని జిల్లా వ్యాప్తంగా 10 రోజులపాటు బస్సు యాత్ర స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కారం కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారని పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు పెన్షన్లు రేషన్ కార్డులు లాంటి అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించారని మిగతా పార్టీల అభ్యర్థులు ఒక్కరోజైనా ప్రజల కోసం రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారా అని ప్రశ్నించారు అందుకే ఈ ఎన్నికల్లో కేవలం ఓట్లు అడిగే నైతిక హక్కు సిపిఎంకు మాత్రమే ఉందని సిపిఎం అభ్యర్థి జహంగీర్ను ప్రజలందరూ ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు
సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్లో సిపిఎం ఏర్పడ్డ నాటి నుండి పోటీ చేస్తుందని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు చేసిన పోరాటాల ద్వారా ప్రజలకు అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని గత 35 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్నానని ఒక అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో ఉన్న అనేక దీర్ఘకాలిక సమస్యలతో పాటు తాత్కాలిక సమస్యలను పరిష్కారం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ప్రజలందరూ ఒకసారి ఆలోచించి సిపిఎంకు ఈ ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో ప్రచారం ప్రారంభించి వెలువర్తి కెర్చిపల్లి, మొగిలిపక ,తుర్కపల్లి,గోపరాజుపల్లి వెంకటా పురం, గ్రామాల్లో పర్యటించమని తెలిపారు ప్రజల నుండి మంచి స్పందన లభించిందని కమ్యూనిస్టులు గెలవాలని ప్రజలందరూ భావిస్తున్నారని అన్నారు
ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ తీగల సాగర్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య కొండమడుగు నరసింహ తప్పెట్ల స్కైలాబ్ బాబు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు కల్లూరి మల్లేశం దోనూరు నర్సిరెడ్డి దాసరి పాండు సిపిఎం మండల కార్యదర్శి సిరిఫంగి స్వామి జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మెరుగు వెంకటేశం కూర శ్రీనివాస్ కల్కూరి రామచందర్ మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు వాకిటి వెంకటరెడ్డి ఏలే కృష్ణ కందడి సత్తిరెడ్డి కవిడే సురేష్ దుబ్బ లింగం కర్ణ కంటి యాదయ్య వేముల నాగరాజు దొడ్డి బిక్షపతి వేముల జ్యోతిబసు పల్చం లింగం ఉండ్రాటి పాపయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
May 03 2024, 17:49