NLG: ఉచితంగా విద్య- వైద్యం అందిస్తాం
పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఉచితంగా విద్య- వైద్యం అందిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మరిగూడ మండలం తమ్మడపల్లె, తిరుగండ్లపల్లి గ్రామాలలో ఇంటింటికి ప్రచారం మరియు ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.
సిపిఎం పోరాట ఫలితంగానే ఉపాధి హామీ చట్టం వచ్చిందని అయినప్పటికీ రోజు కూలి వంద మాత్రమే ఇస్తున్నారని అన్నారు. సిపిఎం అభ్యర్థులు గెలిపించినట్లయితే ఉపాధి హామీ రోజు కూలి రూ. 600 తో పాటు 210 పని దినాలు గ్యారెంటీ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు.
రోజుకు ఒక పార్టీ మారే నాయకులను నమ్మొద్దని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాజ్యాంగాన్ని తొలగించడానికి కుట్రలు చేసే వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే పోలింగ్ రోజు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మహమ్మద్ జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య , వెంకటయ్య అంజయ్య చారి, దామెర లక్ష్మి, ఆయిలు కృష్ణయ్య, ప్రతాపరెడ్డి అమృత, యాదమ్మ, ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.
May 02 2024, 18:45