భువనగిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి వరికుప్పల కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి: తెలంగాణ మైనార్టీ సంఘం సభ్యులు ఖాజా రఫీ హుద్దిన్
భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న అవినీతిని అంతా అంతం చేయాలంటే భువనగిరి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన వరికుప్పల కృష్ణ ను పడవ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ మైనారిటీ సంఘం సభ్యులు ఖాజా రఫి హుద్దీన్ అన్నారు. బుధవారం రోజున హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వరికుప్పల కృష్ణ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని బూర్జువా పార్టీలు ప్రజలకు డబ్బు మద్యం మభ్యపెట్టి మోసం చేస్తున్నాయన్నారు. ప్రజల మనసు మీదికి వచ్చిందంటే ఎలాంటి నాయకుడినైనా ఓడించే సత్తా ఉందని గుర్తుచేశారు. పార్లమెంటు అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని గుర్తించి ఓటు వేయాలన్నారు. గతంలో ఎంపీగా వ్యవహరించిన ఏ నాయకుడు పార్లమెంటును ఉదరించింది లేదని ఎద్దేవ చేశారు. తనను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించినట్లయితే పార్లమెంటుకు పూర్తిస్థాయిలో అభివృద్ధికి పాటుపడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రతిక్షణం అందుబాటులో ఉంటానని శబదం చేశారు. తమ దగ్గర డబ్బు లేకపోయినా అభివృద్ధి సహాయం చేసే మనసు నిండుగా ఉందన్నారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసిన సమయంలో తమను ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివరాత్రి కొమురమల్లు తదితరులు పాల్గొన్నారు.
May 01 2024, 20:09