ఎర్రజెండా గెలుపుతోనే భువనగిరి పార్లమెంటు అభివృద్ధి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
ఎర్ర జెండా గెలుపుతోనే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ తెలియజేసినారు. సోమవారం భువనగిరి మండల వ్యాప్తంగా సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ గారి గెలుపును కోరుతూ నిర్వహించే ప్రచార జాతాను సుందరయ్య భవన్ భువనగిరిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం హైదరాబాద్ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న విద్యా, వైద్యం, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని గత మూడు దఫాలుగా గెలిచిన కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి, సమస్యల పరిష్కారం గురించి ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా నడికుడి నుండి బీబీనగర్ వరకు సింగిల్ లైన్ తో రైల్వే మార్గం ఏర్పడిందని కానీ ఈ పాలకులు డబుల్ లైన్ వేసేకాడ అన్ని స్టేషన్లను అభివృద్ధి చేసి అన్ని ట్రైన్లను ఆపే కాడ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. భువనగిరి జిల్లా కేంద్రమైన నేటికీ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు లేవని ఎందుకు గత పాలకులు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పేరుకే బీబీనగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్ ని ప్రారంభించిన ఇంకా అన్ని రకాల వైద్యము అందడం లేదని బిజెపి ఎయిమ్స్ హాస్పిటల్ కు నిధులు కేటాయించెదాంట్లో వివక్షత చూపుతుందని విమర్శించారు. భువనగిరి ప్రాంతం విద్య పరంగా, వైద్యపరంగా, ఉపాధిపరంగా, సాగు తాగునీరు సమస్య పరిష్కారం కావాలంటే, ఈ ప్రాంతము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాడే నాయకుడు, ప్రశ్నించే నాయకుడు జహంగీర్ గారు గెలవాలని, వారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తని ఆ గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జే. వెంకటేష్, కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వరక సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, నాయకులు పల్లెర్ల అంజయ్య, గుమ్మడి రాజు నరేష్, సాయి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
Apr 30 2024, 11:52