అన్ని వర్గాల ప్రజలు బిజెపి వైపు: పాశం భాస్కర్
భారతీయ జనతా పార్టీ మండల శాఖ అద్యక్షులు బోల్ల సుదర్శన్ మరియు బూత్ అద్యక్షులు కాలే పరమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు 2 వ విడత ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా వలిగొండ మండలం నాతల్లగూడెం గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీ పాశం భాస్కర్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి వారితో మాట్లాడడం జరిగింది, గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కేంద్రం నుండి వస్తుందని వారికి తెలియజేసారు, ఈ సందర్భంగా వారు బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారిని కోరడం జరిగింది అదేవిధంగా నాతల్ల గూడెం గ్రామంలోని చెరువును మరియు మూసి కాల్వను వారు సందర్శించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మూసి నదిని పరివాహక ప్రాంతంలో ఉన్న చెరువులల్లో రసాయన ఎరువుల కర్మాగారంల నుండి వెలువడే కాలుష్యం మూసి నదిలో కలవకుండా ప్రక్షాళన చేసి రైతులకు ,తెలంగాణ ప్రజలకు మంచి నీటి నదిగా మార్చాలని, నది పరివాహక ప్రాంతంలో గొలుసు చెరువులను మంచి నీటి చెరువులుగా మార్చాలని వ్యవసాయం కు,ప్రజలకు ఉపయోగ పడే విధంగా చేయాలని మరియు మూసి పరివాహక ప్రాంతాల్లో వున్న చెరువులలో , కాలువలలో విపరీతంగా పేరుకపోయిన గుర్రపు డెక్క ఆకును ఆధునిక యంత్రాలతో తొలగించి,రైతులకు , తెలంగాణ ప్రజలకు ఉపయోగ పడే విధంగా చేయాలని ఈ సందర్బంగా వారు అన్నారు ఆదేవిధంగా గ్రామంలో వున్న ఐకేపీ సెంటర్ ను సందర్శించి ఒడ్ల కొనుగోళ్లు ,రైతు సమస్యల గురించి తెలుసుకోవడం జరిగిందిఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు CN రెడ్డి ,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్,జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ , దంతూరి సత్తయ్య ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్,మాజీ ఉప సర్పంచ్ మైసొల్ల మచ్చగిరి,కిసాన్ మోర్చా జిల్లా సెక్రెటరీ కందుల తానీషా గౌడ్,మారోజు అనిల్ కుమార్, లోడే లింగ స్వామి, దయ్యాల వెంకటేష్, డోగిపర్తి సంతోష్ , వట్టిపల్లి సంతోష్,గంగధారీ దయాకర్, మైసొల్ల చిన్న మచ్చగిరి, మందుల నాగరాజు, గంగపురం నరేష్, అప్పిశేట్టి సంతోష్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి మందుల లక్ష్మి,BJYM మండల అధ్యక్షులు రంజిత్ రెడ్డి,BJYM జిల్లా నాయకులు రెగురి అమరేందర్,బంగమట్ల మహేష్, దంతూరి అరుణ్, బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Apr 29 2024, 16:04