మహిళా శక్తి చైతన్యమే సమసమాజ నిర్మాణం :సునీత రామ్మోహన్ రెడ్డి విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
భువనగిరి:విశ్వహిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా మాతృశక్తి దుర్గావాహిని ఒకరోజు అభ్యాస వర్గ స్థానిక వైయస్సార్ గార్డెన్లో శ్రీమతి బొక్క అరుణ్ జ్యోతి గారి అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య వక్త విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సమాజంలో సగభాగంగా ఉన్న మాతృశక్తి దర్గా వాహిని పనిని కార్యకర్తలు ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకోవలసిన అవసరం ఉందని సమాజంలో అధిక సమస్యలకు పరిష్కారం చూపే సత్తా మహిళ శక్తికే ఉందని తెలిపారు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సనాతన ధర్మంలో నారీ శక్తికి ఎంతో ప్రాముఖ్యత ఉందని దానిని గుర్తించి తగువిధంగా ఉపయోగించుకుంటే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పాశ్చాత్య ధోరణుల ద్వారా వికృత చేష్టలతో నారీశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు అట్టి శక్తులకు అవకాశం ఇవ్వకుండా నేటి యువతులు శక్తి ఆరాధన ద్వారా నారీశక్తిని గౌరవించుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలి ప్రతి మహిళ యువతులు సత్సంగాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు నరసింహమూర్తి గారు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యున్నత శక్తి మహిళా శక్తి అని మహిళలు యువతులు శక్తి రూపం దాల్చి సనాతన ధర్మాన్ని ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాతృ శక్తి తెలంగాణ ప్రాంత సంయోజిక పద్మశ్రీ గారు మహిళలకు మార్గదర్శనం చేశారు ఈ కార్యక్రమంలో ప్రాంత సహ సంయోజిక శ్రీవాణి గారు నల్గొండ విభాగ్ సంయోజిక శ్రీమతి సత్యవతి భాగ్యలక్ష్మి విభాగ్ సoయోజిక జ్యోతి గారు సహ సంయోజిక అరుంధతి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్వి లావణ్య గారు దంత సుమిత్ర సత్యలక్ష్మి జిల్లా అధ్యక్షులు పొత్నక్ రాఘవేందర్ గారు విశ్వహిందూ పరిషత్ ప్రాంత సహ కార్యదర్శి తోట భాను ప్రసాద్ జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్ చామ రవీందర్ పట్టణ కార్యదర్శి సాల్వేరు వేణు భింగి భరత్ బజరంగ్దళ్ పట్టణ కన్వీనర్ నమిలె నవీన్ శివ పూస శ్రీనివాస్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Apr 28 2024, 16:40