అంగన్వాడి కేంద్రాలను ప్రక్షాళన చేయాలి: బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ప్రక్షాళన చేసి, విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ఆహారం అందించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో శనివారం గర్భిణీ కి అందించిన ఆహారంలో ఈగలు పడి చనిపోయి ఉండడం, అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గత నెలలో స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కేమెరాలు ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తలకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించారని వెంకటేష్ గుర్తు చేశారు. అధికారులు వెంటనే ముఖ్యమంత్రి సూచనలు అమలు చేసి, పసి పిల్లలకు, తల్లులకు, గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Apr 27 2024, 21:22