బొమ్మలరామారం మండల కేంద్రంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గుడ్డిబావి చౌరస్తా వద్ద చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ర్యాలీ,కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ఈ ర్యాలీ కి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు,భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి గారు,గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు.మహిళ సహకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బండ్రు శోభారాణి
తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం మండల కేంద్రం నుండి గుడ్డి బావి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీ భారీజన సంద్రోహం మధ్య కొనసాగింది.
ఈ ర్యాలీ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రజలందరినీ కలుస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
Apr 27 2024, 21:11